ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponguleti: మాయమాటలతో అధికారంలోకి రాలేదు

ABN, Publish Date - Nov 16 , 2024 | 03:45 AM

కాంగ్రెస్‌ మాయ మాటలు చెప్పి అధికారంలోకి రాలేదని, రైతును రాజు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

  • ఇందిరమ్మ రాజ్యంలో సంతోషంగా ప్రజలు

  • డిసెంబరులోపు రుణమాఫీని పూర్తి చేస్తాం

  • జనవరి నుంచి రేషన్‌ ద్వారా సన్న బియ్యం

  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

భైంసా రూరల్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ మాయ మాటలు చెప్పి అధికారంలోకి రాలేదని, రైతును రాజు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయన.. మార్గమధ్యలో నిర్మల్‌ జిల్లా భైంసాలో మాజీ ఎమ్మెల్యే భోంస్లే నారాయణ్‌ పటేల్‌ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా పలు గ్రామాలకు చెందిన 9 మంది లబ్ధిదారులకు రూ.8.34లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మాటేగాం గ్రామానికి వెళ్లి అక్కడ కాంగ్రెస్‌ కార్యకర్తలతో సమావేశమయ్యారు.


ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజా సేవకులుగా పని చేస్తున్నారన్నారు. ఆరు గ్యారంటీలను నెరవేర్చి తీరుతామని పేర్కొన్నారు. రుణమాఫీ కాని రైతులకు డిసెంబరు లోపు మాఫీ చేస్తామని పొంగులేటి చెప్పారు. తెల్ల రేషన్‌ కార్డులున్నవారికి జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. మహారాష్ట్రలోనూ ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆయన ఆకాంక్షించారు.

Updated Date - Nov 16 , 2024 | 03:45 AM