Ponnam Prabhakar : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం చేయండి
ABN, Publish Date - Jul 17 , 2024 | 06:00 AM
తెలంగాణ రాష్ట్రానికి, ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్ర బడ్జెట్‌లో తగినంత కేటాయింపులు జరిగేలా చూడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి మంత్రి పొన్నం లేఖ
కరీంనగర్ అర్బన్, జూలై 16: తెలంగాణ రాష్ట్రానికి, ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్ర బడ్జెట్‌లో తగినంత కేటాయింపులు జరిగేలా చూడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. నియోజకవర్గంలో స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని..
మిడ్ మానేరు, గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసిత కుటుంబాలకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పెట్టించాలని, శాతవాహన వర్సిటీకి రూ.200 కోట్ల ఆర్థిక సాయం అందించేలా, కరీంనగర్-తిరుపతి బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు రోజూ నడిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరీంనగర్- షిర్డీ మధ్య రైల్వే డబ్లింగ్‌ను వేగవంతం చేయాలని, హుస్నాబాద్‌లో మెడికల్ కాలేజ్ మంజూరు చేయాలని, కొత్తపల్లి నుంచి జనగామకు జాతీయ రహదారి నిర్మించాలని, వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి నిధులు తేవాలని పొన్నం కోరారు.
Updated Date - Jul 17 , 2024 | 06:00 AM