Hyderabad: జిల్లాల్లోనూ అక్రమ నిర్మాణాలను కూల్చేస్తాం: పొన్నం
ABN, Publish Date - Aug 27 , 2024 | 03:48 AM
చెరువుల పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): చెరువుల పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ తర్వాత అన్ని జిల్లాల్లోనూ చెరువులు పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. హైడ్రా కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని, ప్రజలంతా హర్షిస్తున్నారన్నారు.
ఎక్కడైనా అన్యాయం జరిగితే న్యాయ స్థానాలు ఉన్నాయని, చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియ్‌సగా ఉందని వెల్లడించారు. హైదరాబాద్ ఒకప్పుడు లెక్ సిటీగా ఉండేదని, చెరువుల పరిరక్షకులు ఆక్రమణలపై ఆధారాలను సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
Updated Date - Aug 27 , 2024 | 03:48 AM