హామీల అమలు కోసం ముఖ్యమంత్రికి పోస్టుకార్డు ఉద్యమం
ABN, Publish Date - Apr 15 , 2024 | 03:52 AM
రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో ముఖ్యమంత్రికి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్‌ఎస్
ప్రారంభించిన మాజీ మంత్రి హరీశ్‌రావు
16న సుల్తాన్‌పూర్‌లో కేసీఆర్ సభ
హైదరాబాద్, జహీరాబాద్/పుల్‌కల్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): : రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో ముఖ్యమంత్రికి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అబద్ధపు మాటల మీద ఏర్పడిన ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ కష్టమేనన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసేవరకు తాము ఆందోళనలను తీవ్రతరం చేస్తామన్నారు. కాగా, సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్ శివారు సింగూరు చౌరస్తా వద్ద ఈ నెల 15న మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. శనివారం సభా స్థలాన్ని హరీశ్ రావు పరిశీలించారు. ఆగా, ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉందని, ఆర్బాటపు ప్రకటనలతో వాస్తవాలు మరుగున పడేశారని ఆరోపించారు. మాటల్లో వికసిత్ భారత్ - చేతల్లో విభజిత్ భారత్ అన్న విధానాన్ని బీజేపీ మరోసారి నిరూపించిందని ఓ ప్రకటనలో విమర్శించారు. గంభీరమైన మాటలు జోడించి పేజీలు నింపడం తప్ప, సమాజం కోరుకుంటున్న దానిపై బీజేపీ తన విధానాన్ని ప్రకటించలేదన్నారు.
Updated Date - Apr 15 , 2024 | 03:52 AM