ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి

ABN, Publish Date - Oct 02 , 2024 | 12:13 AM

ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేదలకు నాణ్య మైన వైద్య సేవలు అందించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు.

రోగులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

మిర్యాలగూడ, అక్టోబరు 1: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేదలకు నాణ్య మైన వైద్య సేవలు అందించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. స్థానిక ఏరియా ఆస్పత్రిని ఆయన మంగళవారం సందర్శించి రోగులకు అందు తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యం కోసం అధిక సంఖ్య లో రోగులు ఏరియా ఆసుపత్రికి వస్తున్నారని, మెరుగైన సేవల కోసం డాక్టర్లు, నర్సుల పోస్టులు భర్తీచేయాలని కోరారు. కిడ్నీ రోగుల కోసం డయాలసిస్‌ మిష న్‌ల సంఖ్య పెంచాలన్నారు. రోగులకు ఇచ్చే భోజనం, మంచినీటి విషయంలో నాణ్యత పాటించాలన్నారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు తరుచుగా నిర్వహించి రోగుల అవసరాల మేరకు వైద్యసౌకర్యాలను మెరుగు పర్చాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్‌ మల్లేష్‌, వీరేపల్లి వెంకటే శ్వర్లు, రవినాయక్‌, గౌతంరెడ్డి, లక్ష్మీనారాయణ, వినోద్‌నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2024 | 12:13 AM