ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మోదీని విమర్శించే స్థాయి రాహుల్‌కు లేదు

ABN, Publish Date - Sep 25 , 2024 | 03:25 AM

ప్రధాని మోదీని విమర్శించే స్థాయి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కశ్మీర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా

దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్‌ దోస్తీ: కిషన్‌ రెడ్డి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీని విమర్శించే స్థాయి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కశ్మీర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి ఖండించారు. దేశ, విదేశాల్లో భారత గౌరవాన్ని పెంచుతున్న మోదీపై విమర్శలు చేసే నైతిక హక్కు రాహల్‌కు లేదన్నారు. మోదీపై 140 కోట్ల మంది ప్రజలకు విశ్వాసం ఉందని చెప్పారు. పార్లమెంటును, స్పీకర్‌ వ్యవస్థను, సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ సంస్థలను అగౌరవపరచడం, భారత సైన్యం వంటి సున్నితమైన వ్యవస్థపై ప్రశ్నలను లేవనెత్తడం, వ్యతిరేక శక్తులతో దోస్తీ చేయడం, ఓట్లకోసం కుల మతాల మధ్య విభేదాలు సృష్టించడం రాహుల్‌కు నిత్యకృత్యమైందన్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, పారిపోయిన వ్యక్తి రాహుల్‌ అని.. ఇప్పుడాయన జమ్మూకశ్మీర్‌లో విజయంపై నమ్మకం లేక.. దేశ వ్యతిరేక శక్తులతో జతకట్టారని ఆరోపించారు.

Updated Date - Sep 25 , 2024 | 03:25 AM