ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి రాజయ్య

ABN, Publish Date - Apr 15 , 2024 | 03:51 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే టీ రాజయ్య ఎట్టకేలకు సొంతగూటికి చేరుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఆదివారం సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్‌హౌ్‌సలో బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. రాజయ్య

స్టేషన్‌ఘన్‌పూర్‌, ఏప్రిల్‌ 14: స్టేషన్‌ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే టీ రాజయ్య ఎట్టకేలకు సొంతగూటికి చేరుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఆదివారం సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్‌హౌ్‌సలో బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. రాజయ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ రానందుకు నిరసనగా ఫిబ్రవరి 3న బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేశారు. వారం రోజు ల్లో కాంగ్రె్‌సలో చేరతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర అనుచరులు రాజయ్యను కాంగ్రె్‌సలోకి తీసుకోవద్దంటూ ఆందోళనలు చేపట్టారు. నియోజకవర్గ మహిళా నాయకులు ఏకంగా గాంధీ భవన్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ రాజయ్య సీఎం రేవంత్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు ఖర్గే తదితరులను కలిసి పార్టీలో చేరిక అంశమై చర్చించారు. అయినా రాజయ్యకు కాంగ్రెస్‌ నుంచి ఆహ్వానం రాలేదు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మార్చి 13న వరంగల్‌ పార్లమెంట్‌ టికెట్‌ను కడియం కావ్యకు ఇస్తున్నట్లు ప్రకటించారు. 28న టికెట్‌ను నిరాకరిస్తూ కేసీఆర్‌కు కావ్య లేఖ రాశారు. 29న కాంగ్రెస్‌ నేతలు కడియంను పార్టీలోకి ఆహ్వానించడం, 31న కడియం శ్రీహరి, కావ్య రేవంత్‌ సమక్షంలో కాంగ్రె్‌సలో చేరడం, ఏప్రిల్‌ 1న వరంగల్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కావ్య పేరును ప్రకటించడం వరుసగా జరిగిపోయాయి. అప్పటి నుంచి రాజయ్య బీఆర్‌ఎస్‌ తనకు వరంగల్‌ పార్లమెంట్‌ టికెట్‌ ఇస్తే తిరిగి పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 12న ఎంపీ టికెట్‌ రాజయ్యకు ప్రకటిస్తారనే వార్తలు రావడంతో ఆయన ఎర్రవెల్లికి వెళ్లారు. కానీ చివరికి కేసీఆర్‌ హనుమకొండ జడ్పీ చైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌ పేరును ప్రకటించారు. దాంతో రాజయ్య కేసీఆర్‌ను కలవకుండానే వెనుదిరిగారు. చివరకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఆధ్వర్యంలో రాజయ్య బీఆర్‌ఎ్‌సలో చేరారు.

Updated Date - Apr 15 , 2024 | 03:51 AM

Advertising
Advertising