ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రూ.5లక్షలు, 2తులాల బంగారం అపహరణ

ABN, Publish Date - May 29 , 2024 | 11:42 PM

తీర్థయాత్రలకు వెళ్లి ఇంటికి వచ్చే సరికి రూ. 5లక్షల20వేల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తలకొండపల్లి పోలీసులు చెప్పారు.

తలకొండపల్లి, మే 29 : తీర్థయాత్రలకు వెళ్లి ఇంటికి వచ్చే సరికి రూ. 5లక్షల20వేల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తలకొండపల్లి పోలీసులు చెప్పారు. మండలంలోని వెల్జాల గ్రామానికి చెందిన తల్లోజు రాఘవేందర్‌ గ్రామంలో కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్‌ మనీ బ్యాంక్‌ను నడుపుతున్నాడు. తన వద్ద ఉన్న రూ.5లక్షల20వేలు అతడి తల్లి నారాయణమ్మకు ఇచ్చి మంత్రాలయం వెళ్లారు. తర్వాత ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో పాటు సోదరుడు శ్రీ శైలం కలిసి బుధవారం శ్రీశైలం పుణ్యక్షేత్రం వెళ్లారు. వారంతా శ్రీశైలం నుంచి ఇంటికి వచ్చేసరికి బీరువాలో ఉన్న నగదు, లాకర్‌లో ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌ చెప్పారు.

Updated Date - May 29 , 2024 | 11:42 PM

Advertising
Advertising