బైక్ దొంగను స్తంభానికి కట్టేసి దేహశుద్ధి
ABN, Publish Date - Oct 21 , 2024 | 11:37 PM
బైక్ చోరీ చేసిన వ్యక్తిని గ్రామస్తులు పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన సోమవారం రాత్రి గడిసింగాపూర్‌లో జరిగింది.
పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు
పరిగి, అక్టోబరు 21 (ఆంద్రజ్యోతి): బైక్ చోరీ చేసిన వ్యక్తిని గ్రామస్తులు పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన సోమవారం రాత్రి గడిసింగాపూర్‌లో జరిగింది. తాండూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి ఈనెల 18న పరిగిలోని విజేత ఆస్పతి దగ్గర పెట్టిన బైక్ చోరీకి గురైంది. దోమ మండలం బుద్లాపూర్ గ్రామానికి చెందిన ముకుందం పరిగిలో పెయింటర్‌గా పనిచేస్తుంటాడు. దొంగతానికి గురైన బైక్‌పై ముకుందం సోమవారం గడిసింగాపూర్ మీదుగా వెళుతుండగా బైక్ యజమానికి చెందిన బంధువులు గుర్తించి ముకుందంను పట్టుకుని స్థానిక విద్యుత్‌స్తంభానికి కట్టేసి చితకబాదారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పరిగి పోలీసులు దొంగను స్టేషన్‌కు తరలించారు.
Updated Date - Oct 21 , 2024 | 11:37 PM