యజమానికి తెలియకుండా వైన్స్ డబ్బులు వాడుకున్న వ్యక్తిపై కేసు
ABN, Publish Date - Aug 02 , 2024 | 12:01 AM
యజమానికి తెలియకుండా వైన్స్ డబ్బులు వాడుకున్న ఓ వ్యక్తిపై ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఘట్‌కేసర్ రూరల్, ఆగస్టు 1: యజమానికి తెలియకుండా వైన్స్ డబ్బులు వాడుకున్న ఓ వ్యక్తిపై ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సైదులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అవుషాపూర్‌లోని శ్రీనిధి వైన్స్‌లో పనిచేస్తున్న మహిపాల్‌రెడ్డి గత నెలరోజుల నుంచి మద్యం విక్రయించగా వచ్చిన రూ.15లక్షలు సొంతానికి వాడుకున్నాడని యజమాని బొక్క మల్లారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Updated Date - Aug 02 , 2024 | 12:01 AM