ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తుది దశకు సమగ్ర ఇంటింటి సర్వే

ABN, Publish Date - Nov 23 , 2024 | 11:36 PM

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరింది. శనివారం వరకు రంగారెడ్డి జిల్లాలో 88.3 శాతం సర్వే పూర్తి కాగా, వికారాబాద్‌ జిల్లాలో 89 శాతం పూర్తయ్యింది.

రంగారెడ్డి జిల్లాలో 88.3 శాతం, వికారాబాద్‌ జిల్లాలో 89 శాతం పూర్తి

రంగారెడ్డిలో డాటా ఎంట్రీ షురూ

7,700 కుటుంబాల వివరాలు కంప్యూటరీకరణ

వికారాబాద్‌లో డాటా ఎంట్రీ కోసం 176 కంప్యూటర్లు సిద్ధం

రంగారెడ్డి అర్బన్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరింది. శనివారం వరకు రంగారెడ్డి జిల్లాలో 88.3 శాతం సర్వే పూర్తి కాగా, వికారాబాద్‌ జిల్లాలో 89 శాతం పూర్తయ్యింది. రంగారెడ్డి జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో 95 శాతం సర్వే పూర్తి చేయగా, మున్సిపాలిటీల్లో 83 శాతం పూర్తి చేశారు. వికారాబాద్‌ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 89 శాతం, మునిసిపాలిటీల పరిధిలో 90 శాతం సర్వే పూర్తయ్యింది. మిగిలిన కుటుంబాలను త్వరగా పూర్తి చేసేలా ఆయా జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారు.

రంగారెడ్డి జిల్లాలో 6,04,421 ఇళ్లను గుర్తించగా, శనివారం వరకు 5,376 మంది ఎన్యుమరేటర్లు 5,33,664 ఇళ్లలోని కుటుంబాల వివరాలను నమోదు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,57,063 కుటుంబాలకు సంబంధించి సర్వే వివరాలను సేకరించారు. అలాగే మున్సిపాలిటీల్లో 2,76,601 ఇళ్లలోని కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేశారు.

వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 2,83,373 ఇళ్లు ఉన్నట్లు గుర్తించగా, ఈనెల 23వ తేదీ వరకు 2,52,535 ఇళ్లల్లోని కుటుంబాల వివరాలను ఎన్యూమరేటర్లు నమోదు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,38,635 ఇళ్లలోని 2,12,192 కుటుంబాల వివరాలు నమోదు చేసుకోగా, మునిసిపాలిటీల పరిధిలో 44,738 ఇళ్లలోని 40,343 కుటుంబాల వివరాలు నమోదు చేశారు.

ఎన్యుమరేటర్‌కు 120 నుంచి 180 ఇళ్లు

ఒక్కో ఎన్యుమరేటర్‌కు 120 నుంచి 180 వరకు ఇళ్లను కేటాయించారు. ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించేందుకు ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల సేవలు తీసుకుంటున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాఠశాల విధులు పూర్తి చేసుకుని, ఆ తర్వాత ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో చకచకా డేటా ఎంట్రీ

రంగారెడ్డి జిల్లాలో డేటా ఎంట్రీ చకచకా కొనసాగుతోంది. సర్వే వివరాలను కంప్యూటర్‌లో ఎంట్రీ చేసేందుకు ఆపరేటర్లకు రెండు రోజులు శిక్షణ ఇచ్చారు. 2,500 మంది ఆపరేటర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. 24 గంటల పాటు డేటా ఎంట్రీ కొనసాగుతుంది. షిప్టుల వారీగా విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం ఒక్క రోజే జిల్లాలో 7700 కుటుంబాల సర్వే వివరాలను కంప్యూటకరీంచారు.

వికారాబాద్‌లో డేటా ఎంట్రీకి ఏర్పాట్లు

వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా శనివారం వరకు 89 శాతం సర్వే పూర్తి కాగా, అధికార యంత్రాంగం డేటా ఎంట్రీపై దృష్టి సారించింది. సర్వే ఫారాల్లోని వివరాలను కంప్యూటరీకరణ చేసేందుకు 240 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఎంపిక చేశారు. సర్వే సమాచారాన్ని కంప్యూటరీకరణ చేసేందుకు 176 కంప్యూటర్లు సిద్ధం చేశారు. ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకూ కంప్యూటరీకరణ చేయాల్సి ఉండగా, ఇంకా జిల్లాలో ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభించలేదు.

ధారూరులో 97 శాతం పూర్తి...

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో శనివారం వరకు 97 శాతం పూర్తి చేసుకుని ధారూరు మండలం జిల్లాలో మిగతా మండలాల కంటే ముందుండగా, మర్పల్లి 92 శాతం, కోట్‌పల్లి 95, బొంరా్‌సపేట్‌ 93, నవాబ్‌పేట్‌ 93, దుద్యాల్‌ 89, దోమ 90, పరిగి 89, బంట్వారం 91, చౌడాపూర్‌ 90, కొడంగల్‌ 86, తాండూరు 88, వికారాబాద్‌ 87, మోమిన్‌పేట్‌ 86, పూడూరు 84, పెద్దేముల్‌ 87, దౌల్తాబాద్‌ 90, కులకచర్ల 90, బషీరాబాద్‌ 88, యాలాల్‌ మండలంలో 79 శాతం సర్వే పూర్తయింది. పట్టణ ప్రాంతాల్లో పరిగి మునిసిపాలిటీ పరిధిలో 97 శాతం సర్వే పూర్తి కాగా, కొడంగల్‌ పరిధిలో 92, వికారాబాద్‌లో 94, తాండూరు మునిసిపాలిటీలో 85 శాతం సర్వే పూర్తయింది. ఇదిలా ఉంటే, సర్వే పూర్తి చేసిన వారి నుంచి శనివారం వరకు 1,54,479 ఫారాలు అధికారులకు అందాయి. వీటిలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఫారాలు 1,24,522 ఉండగా, పట్టణ ప్రాంతాలకు చెందిన 29,957 ఫారాలు ఉన్నాయి.

Updated Date - Nov 23 , 2024 | 11:36 PM