డైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
ABN, Publish Date - Nov 19 , 2024 | 11:08 PM
ప్రభుత్వం డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ల సమావేశం నిర్వహించారు.
చేవెళ్ల, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం డ్రైవర్ల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా రూ.25 లక్షలు ఇవ్వాలన్నారు. ప్రైవేటు పాఠశాలలు కార్మిక చట్టాలకు విరుద్దంగా డ్రైవర్లకు వేతనాలు చెల్లిస్తున్నారని తెలిపారు. అనంతరం చేవెళ్ల నూతన బస్సు డ్రైవర్ల సంఘం యూనియన్ ఏర్పాటు చేశారు. డ్రైవర్లు కిష్టయ్య, వెంకటయ్య, కుమార్, ప్రభాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 19 , 2024 | 11:08 PM