ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాగా చదువుకుంటేనే మంచి భవిష్యత్తు

ABN, Publish Date - Nov 14 , 2024 | 11:44 PM

బాగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని, అశ్రద్ధ చేయకుండా అందరూ బాగా చదువుకోవాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ అన్నారు. గురువారం పట్టణంలోని సంగం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో జాతీయ బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించగా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

మేడ్చల్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన బాలల దినోత్సవంలో అధికారులు, టీచర్లు, విద్యార్థులు

వికారాబాద్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

ఘనంగా జాతీయ బాలల దినోత్సవం

వికారాబాద్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : బాగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని, అశ్రద్ధ చేయకుండా అందరూ బాగా చదువుకోవాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ అన్నారు. గురువారం పట్టణంలోని సంగం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో జాతీయ బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించగా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా విద్యార్థులు మార్చ్‌ఫా్‌స్టతో ఆయనకు స్వాగతం పలుకగా, పరిగి బాలసదనం విద్యార్థినీలచే నృత్యప్రదర్శన ఏర్పాటు చేసి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులకు జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చాచా నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకోవడం సంతోషకరమైందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర పోటీల్లో గెలుపొందిన విజేతలకు కలెక్టర్‌ బహుమతులు ప్రదానం చేశారు. అంతకుముందు పట్టణంలోని జిల్లా పరిషత్‌(బాలుర) ఉన్నత పాఠశాలను సందర్శించారు. చిత్రలేఖనం పోటీలను నిర్వహించగా.. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. డిగ్రీ కళాశాలలో నీటి సౌకర్యం, మరుగుదొడ్ల మరమ్మతులకు అయ్యే ఖర్చుల వివరాలను సమర్పించాలని ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, ప్రిన్సిపాల్‌ వేణుగోపాల్‌రెడ్డి, కాంతారావు, శ్రీకాంత్‌, బాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌లో..

మేడ్చల్‌ ప్రతినిధి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి) : జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో వేడుకలు నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ బాలబాలికలు చదువుతోనే ఏదైనా సాధించగలుగుతారని, ఉన్నతస్థాయిలో ఉంటారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. డీఆర్వో హరిప్రియ, అధికారులు స్వర్ణలత, రఘునాథస్వామి, రామ్మోహన్‌, నాగమణి, ఇంతియాజ్‌ రహీం, టీచర్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 11:44 PM