ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పేదరిక నిర్మూలనకు పెద్దపీట

ABN, Publish Date - Oct 23 , 2024 | 11:50 PM

పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, కుల వృత్తుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు.

ప్రొసీడింగ్‌ను అందిస్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి

ఆమనగల్లు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, కుల వృత్తుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీకి చెందిన పలువురు నాయకులు బుధవారం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్‌ వస్పుల జంగయ్య, కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు ఎగిరిశెట్టి సత్యంలతో ఎమ్మెల్యేను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేయించాలని కోరారు. ఆమనగల్లు గుర్రంగుట్ట కాలనీలో బీసీ కమ్యూనిటీ హాల్‌ నిర్మించాలని పూసల సంఘం జిల్లా నాయకుడు పస్పులేటి సత్యం ఆధ్వర్యంలో సంఘం నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇవ్వగా.. ఎమ్మెల్యే వెంటనే ఎస్‌డీఎఫ్‌ నిధుల నుంచి రూ.5లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ దశలవారిగా అన్ని సామాజిక వర్గాలకు కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి, ఆధునీకరణకు రూ.300 కోట్లు సీఎం మంజూరు చేశారని ఎమ్మెల్యే కసిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వస్పుల జంగయ్య, సత్యం, నూతనగంటి వెంకటేశ్‌, మోహన్‌, నరేందర్‌, మహేశ్‌ పాల్గొన్నారు.

మాజీ సర్పంచ్‌ కు ఎమ్మెల్యే పరామర్శ

అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న తిమ్మినోనిపల్లి మాజీసర్పంచ్‌ రామచంద్రారెడ్డి ని ఎమ్మెల్యే పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Updated Date - Oct 23 , 2024 | 11:50 PM