ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

ABN, Publish Date - Nov 19 , 2024 | 12:04 AM

చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన తాండూరు మండలంలోని కరన్‌కోట్‌ గ్రామంలో చోటుచేసుకుంది.

తాండూరు రూరల్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన తాండూరు మండలంలోని కరన్‌కోట్‌ గ్రామంలో చోటుచేసుకుంది. కరన్‌కోట్‌ ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జోగు హుస్సేనప్ప(53) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం కొత్తమల్లి రంగారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో కూలిపనికి వెళ్లాడు. మధ్యాహ్నం 2గంటలకు హుస్సేనప్ప టేకుచెట్టు ఎక్కి కొమ్మలు నరుకుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి తల వెనుకభాగంలో తీవ్రగాయాలయ్యాయి. దీంతో హుస్సేనప్పను వెంటనే ఆటోలో తాండూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తమ్ముడు జోగు దస్తప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు..

కొడంగల్‌ రూరల్‌: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన కొడంగల్‌ మండల పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ జీవీ.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దౌల్తాబాద్‌ మండల కేంద్రానికి చెందిన బొక్క వెంకటమ్మ కుమారుడు బొక్క సురేష్‌(17) అతడి స్నేహితులు అలీ, మహేందర్‌లతో కలిసి కొడంగల్‌లో జరిగిన సదర్‌ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చారు. ఉత్సవాలు ముగిసిన తరువాత బైక్‌పై ముగ్గురూ స్వంత గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో చిన్ననందిగామ గేటు సమీపంలో లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన సురే్‌షను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మన్నెగూడ వద్ద మృతిచెందాడు. అలీ, మహేందర్‌లకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హైదారాబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై మృతుడు బొక్క సురేష్‌ తల్లి బొక్క వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చలికి తట్టుకోలేక గుర్తు తెలియని వ్యక్తి..

వికారాబాద్‌: చలికి తట్టుకోలేక గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్‌ పట్టణంలోని వేంకటేశ్వర కాలనీ కమాన్‌ సమీపంలో ఓ బేకరి మెట్లపై గుర్తుతెలయిన వ్యక్తి రాత్రి నుంచి చలిలో రాత్రంతా కూర్చొని అక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, ఒంటిపై బూడిదరంగు ప్యాంటు, తెల్లచొక్కా కుడిచేతికి ఎర్రదారం ఉందని తెలిపారు. సంబంధీకులు వికారాబాద్‌ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సెల్‌ నెంబర్‌ 8712670030కు కాల్‌ చేయాలని తెలిపారు.

Updated Date - Nov 19 , 2024 | 12:04 AM