గిరిజన సాధికారతకు పెద్దపీట
ABN, Publish Date - Nov 15 , 2024 | 11:51 PM
గిరిజన సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాల లక్ష్యాల సాధనకు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్మే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు.
ఎమ్మెల్యే కసిరెడ్డి
కడ్తాల్ , నవంబరు 15 (ఆంధ్రజ్యోతి ): గిరిజన సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాల లక్ష్యాల సాధనకు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్మే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. సంపూర్ణ గిరిజనాభివృద్ధి కోసం అమలు చేస్తున్న ధర్తి ఆబాజన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోవాలని ఆయన పిలుపు నిచ్చారు. కడ్తాల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం ఈ కార్యక్రమం అమలులో భాగంగా గిరిజనులతో ప్రధాని మోదీ వర్చ్యువల్‌గా సమావేశమయ్యారు. దేశంలో గిరిజనుల జీవన ప్రమాణాల పెంపు, ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా రూ.79,156 కోట్లతో అమలు చేస్తున్న దర్తీ ఆబా కార్యక్రమంలో పథఽకాల ద్వారా కలిగే ప్రయోజనాల గురించి వర్చ్యువల్‌గా మోదీ వివరించారు. అనంతరం జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైన మైసిగండి ఆశ్రమ పాఠశాల విద్యార్థులను సత్కరించి ప్రశంస పత్రాలు అందజేశారు. జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి రామేశ్వరి దేవి, పథకం ప్రత్యేకాధికారి గీత, ఏటీడీవో వెంకటయ్య, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, యాట నర్సింహ్మ, చేగూరి వెంకటేశ్, హన్మనాయక్ పాల్గొన్నారు.
Updated Date - Nov 15 , 2024 | 11:51 PM