ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సెల్‌ఫోన్లు అపహరించిన నిందితుడి రిమాండ్‌

ABN, Publish Date - Jul 06 , 2024 | 11:48 PM

సెల్‌ఫోన్లను అపహరించుకెళ్లిన నిందితున్ని ఘట్‌కేసర్‌ పోలీసులు అరెస్టు చేసి శనివారం సాయంత్రం రిమాండ్‌కు తరలించారు.

ఘట్‌కేసర్‌ రూరల్‌, జూలై 6: సెల్‌ఫోన్లను అపహరించుకెళ్లిన నిందితున్ని ఘట్‌కేసర్‌ పోలీసులు అరెస్టు చేసి శనివారం సాయంత్రం రిమాండ్‌కు తరలించారు. క్రైం సీఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 5వ తేదీ తెల్లవారుజామున ఘట్‌కేసర్‌లోని బ్రూక్‌బాండ్‌ కాలనీలో నివాసం ఉండే రేనాదేవి ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తి చొరబడి రూ.80వేల విలువ గల మూడు సెల్‌ఫోన్లను అపహరించుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు. శనివారం ఉదయం ఘట్‌కేసర్‌ బస్టాండ్‌ ఆవరణలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ యువకున్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మహారాష్ట్ర, నాందేడు జిల్లా, కందర్‌ గ్రామానికి చెందిన ఉమేష్‌ అలియాస్‌ లడ్డు(20) ఘట్‌కేసర్‌లోని రాంనగర్‌లో ఉంటూ కూలీపనులు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిపారు. ఇటీవల జల్సాలకు అలవాటుపడి పని మానేశాడు. ఈ నెల 5న రేనాదేవి ఇంట్లోకి చొరబడి మూడు సెల్‌ఫోన్లను అపహరించినట్లు ఉమేష్‌ అంగీరించినట్లు పోలీసులు తెలిపారు. ఉమే్‌షపై గతంలో రెండు కేసులు ఉన్నట్లు తెలిపారు. సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని నిందితున్ని రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Jul 06 , 2024 | 11:48 PM

Advertising
Advertising
<