ఆదర్శ మున్సిపాలిటీ దిశగా ఆదిభట్ల
ABN, Publish Date - Oct 19 , 2024 | 11:55 PM
ప్రజా సమస్యలు ప్రాధాన్యతా క్రమంలో దశలవారిగా పరిష్కరిస్తూ ఆదిభట్లను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతున్నామని మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్‌రెడ్డి అన్నారు
మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్‌రెడ్డి
65 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం
ఆదిభట్ల, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలు ప్రాధాన్యతా క్రమంలో దశలవారిగా పరిష్కరిస్తూ ఆదిభట్లను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతున్నామని మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్‌రెడ్డి అన్నారు మున్సిపాలిటీ పరిధిలోని 1, 13, 14 వార్డులలో కౌన్సిలర్లు లావణ్య పాండురంగారెడ్డి, అర్చనా రాంరెడ్డి లతో కలిసి శనివారం రూ.65లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులు ఆయన ప్రారంభించారు. నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అత్యవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. ప్రజల సహకారంతో ఆదిభట్లను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దునున్నట్లు తెలిపారు. కమిషనర్ బాలకృష్ణ, డీఈ కుమార్, మాజీ సర్పంచ్‌లు పొట్టి అయిలయ్య, గణే్‌షగౌడ్, నాయకులు పైళ్ల శ్రీనివా్‌సరెడ్డి, గౌని బాల్‌రాజ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 19 , 2024 | 11:55 PM