చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
ABN, Publish Date - Nov 29 , 2024 | 11:42 PM
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. శంకర్‌పల్లి నారాయణ స్కూల్‌లో శుక్రవారం జరిగిన వికారాబాద్ జోన్ స్పోర్ట్స్‌మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
శంకర్‌పల్లి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. శంకర్‌పల్లి నారాయణ స్కూల్‌లో శుక్రవారం జరిగిన వికారాబాద్ జోన్ స్పోర్ట్స్‌మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీఎం గోపాల్‌రెడ్డి, ఏజీఎం వల్లి కుమార్, ప్రిన్సిపాల్ దివ్యలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన క్రీడా పోటీలను ప్రారంభించారు. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంఈవో అక్బర్. నాయకులు గోపాల్‌రెడ్డి, ప్రవీన్‌కుమార్, పాండురంగారెడ్డి, బలవంత్‌రెడ్డి, పీఈటీ సురేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Updated Date - Nov 29 , 2024 | 11:42 PM