ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అర్ధరాత్రి చోరీకి యత్నం.. పట్టుబడిన దొంగ

ABN, Publish Date - Mar 22 , 2024 | 12:00 AM

కొడంగల్‌ మున్సిపల్‌ పరిధిలోని సన్‌సిటీ కాలనీలో బుధవారం రాత్రి దొంగతనానికి యత్నించి పట్టుబడ్డాడు.

దొంగతనానికి యత్నించి పట్టుబడిన యువకుడు

కొడంగల్‌, మార్చి 21: కొడంగల్‌ మున్సిపల్‌ పరిధిలోని సన్‌సిటీ కాలనీలో బుధవారం రాత్రి దొంగతనానికి యత్నించి పట్టుబడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కాలనీలో బుధవారం సాయంత్రం ఓ యువకుడు సంచరిస్తూ ఇళ్లను పరిశీలించి వెళ్లిపోయాడు. బుధవారం అర్ధరాత్రి కాలనీకి చెందిన గోపాల్‌ ఇంటి ముందున్న శునకం అరవడంతో కాలనీలోని పలు ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు వచ్చి గమనించారు. అప్పటికే పొదల చాటున దాక్కున్న ఓ యువకున్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే కానిస్టేబుల్‌ షఫీ బైక్‌పై దొంగలను వెంబడించారు. అప్పటికే కానిస్టేబుల్‌ నరేందర్‌రెడ్డి, హరిలాల్‌లు లాఠీని వాహనంపై విసరగా దొంగల వాహనం అద్దాలు పగిలినా తప్పించుకున్నారు. ఎస్సై భరత్‌రెడ్డి సిబ్బందితో అంబేడ్కర్‌ చౌరస్తాలో బందోబస్తు నిర్వహించినా ఫలితం లేకపోయింది. ఎస్‌ఐ భరత్‌రెడ్డి అక్కడికి వచ్చి ఆ యువకున్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై ఎస్‌ఐ భరత్‌రెడ్డికి సమాచారం అందించగా పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించగా పొదల చాటున ఓ దొంగ పట్టుబడ్డాడు. పట్టుబడిన దొంగతో ఎక్కడెక్కడ తిరిగారనే కోణంలో విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పట్టుబడిన దొంగ దగ్గర కర్నాటకకు సంబంధించిన ఆధారాలు లభించాయని తెలిపారు. సీసీ కెమెరాల సాయంతో వీలైనంత త్వరగా మిగతా వారిని పట్టుకుంటామన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 12:00 AM

Advertising
Advertising