గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ABN, Publish Date - Oct 21 , 2024 | 11:56 PM
శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని కూరగాయల మార్కెట్ ఎదుట సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఆర్జీఐఏ సీఐ బాల్‌రాజ్ తెలిపారు. మార్కెట్ ఎదుట దాదాపు 35 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు.
శంషాబాద్ రూరల్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని కూరగాయల మార్కెట్ ఎదుట సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఆర్జీఐఏ సీఐ బాల్‌రాజ్ తెలిపారు. మార్కెట్ ఎదుట దాదాపు 35 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేదు. ఈమేరకు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. మృతుడి ఒంటిపై బ్లాక్ కలర్ ప్యాంట్, బ్లూకలర్ షార్ట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు తెలిస్తే ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు సూచించారు.
Updated Date - Oct 21 , 2024 | 11:56 PM