నల్సార్ ప్రొఫెసర్లుగా గోపాలకృష్ణ గాంధీ, సాయినాథ్‌ల నియామకం
ABN, Publish Date - Jun 20 , 2024 | 12:27 AM
శామీర్‌పేటలోని నల్సార్ యూనివర్శిటీ ప్రొఫెసర్లుగా మాజీ గవర్నర్, దౌత్యవేత్త గోపాలకృష్ణ గాంధీ, మెగాససె అవార్డు గ్రహిత సాయినాథ్‌లు నియమితులయ్యారు.
శామీర్‌పేట, జూన్ 19 : శామీర్‌పేటలోని నల్సార్ యూనివర్శిటీ ప్రొఫెసర్లుగా మాజీ గవర్నర్, దౌత్యవేత్త గోపాలకృష్ణ గాంధీ, మెగాససె అవార్డు గ్రహిత సాయినాథ్‌లు నియమితులయ్యారు. గోపాలకృష్ణ ప్రజాపాలనరంగం, దౌత్యరంగంలోను, పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా, తదితర ఉన్నత బాధ్యతలు నిర్వహించారు. అలాగే ప్రొఫెసర్ సాయినాథ్ 2007లో రామన్ మెగససె అవార్డుతో పాటు 60కి పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా నల్సార్ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ కృష్ణదేవరావు మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో మేధావుల బోధనల ద్వారా చట్టమనేది కేవలం సాంకేతిక విషయంపై అఽధ్యయనం మాత్రమే కాదని, విద్యార్థులకు సామాజిక, ఆర్థిక న్యాయానికి లోతైన ప్రశ్నలు, అంశాలను అందించడం అవసరమని ఆయన వెల్లడించారు.
Updated Date - Jun 20 , 2024 | 09:48 AM