ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విముక్తి కోసమే ‘సాయుధ పోరాటం

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:01 AM

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసమే తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బుద్దుల జంగయ్య తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న బుద్దుల జంగయ్య

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు జంగయ్య

పులుసుమామిడిలో తెలంగాణ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవ సభ

కొందుర్గు, సెప్టెంబరు 15: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసమే తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బుద్దుల జంగయ్య తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని పులుసుమామిడిలో తెలంగాణ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దున్నేవాడిదే భూమి కావాలని తెలంగాణ సాయుధ పోరాటాన్ని కామ్రేడ్‌ రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మొయినోద్దిన్‌ల ఆధ్యర్యంలో పెద్దఎత్తున నిర్వహించారని, ఈ పోరాటంలో వేలాది మంది చిన్న, సన్నకారు రైతులు పాల్గొని, ఎర్ర జెండాలు పాతి.. లక్షలాది ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని సాగు చేసినట్లు గుర్తుచేశారు. ఈక్రమంలో జాగీర్దార్లు, జమీందారులు కలిసి రైతులను అతి కిరాతకంగా చంపారని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షేక్‌ బందగి వంటి వారు ప్రాణత్యాగం చేశారని అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. సెప్టెంబరు 17ను విలీన దినంగా ప్రకటిస్తామని చెప్పి మాట తప్పిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా విలీన దినంగా ప్రకటించి, అధికారికంగా నిర్వహించాలని కోరారు. సమావేశంలో బి.నర్సింహ, జి.వెంకటేష్‌, ఏఐటీయూసీ రెండు మండలాల కార్యదర్శులు బాల్‌రాజ్‌, సి.సురేష్‌, నాయకులు బాలకృష్ణయ్య, యామిని, ఎం.కృష్ణ, పెంటయ్య, వెంకటయ్య, రాంచంద్రయ్య, జంగయ్య, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:01 AM

Advertising
Advertising