ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎక్మాయి శివారులో నక్కల దాడి.. పలువురికి గాయాలు

ABN, Publish Date - Jul 26 , 2024 | 11:42 PM

పంటల పొలాలకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళపై నక్కలు దాడి చేయడంతో తీవ్ర రక్త గాయాలపాలై ఆస్పత్రి పాలయ్యారు.

బషీరాబాద్‌, జూలై 26: పంటల పొలాలకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళపై నక్కలు దాడి చేయడంతో తీవ్ర రక్త గాయాలపాలై ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన బషీరాబాద్‌ మండలం ఎక్మాయి శివారులో శుక్రవారం మఽధ్యాహ్నం జరిగింది. గ్రామానికి చెందిన కరణ్‌కోట్‌ నవాజ్‌రెడ్డి, బసమ్మ, తుప్పుడు మహిపాల్‌ పంట పొలాలకు వెళ్లారు. ఈ క్రమంలో మూడు నక్కలు గుంపుగా వచ్చి వీరిపై వేర్వేరు చోట్ల దాడికి దిగాయి. ఈ ఘటనలో వారి చేతులు, కాళ్లు, నోటి భాగాల్లో గాట్లుపడ్డాయి. ఇద్దరు రైతులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ దాడిలో మహిళ ముఖంపై నక్కలు గాట్లు వేయగా ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. నక్కల దాడిలో గాయాలైన వారు పంట పొలాల్లోంచి భయందోళనతో ఊర్లోకి పరుగెత్తుకొచ్చినట్లు బాధిత కుటింబీకులు, స్థానికులు వాపోయారు. గ్రామశివారులో మృత్యువాతపడిన ఎద్దు కళేబరాలను నక్కలు తిని పిచ్చేక్కి పొలాల్లో తిరుగుతున్నాయని రైతులు పలువురు ఆందోళన వ్యక్తంచేశారు. బాధితులను తాండూరు జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంబంధిత అధికారులు నక్కల బారినుంచి తమను రక్షించాలని కోరుతున్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:42 PM

Advertising
Advertising
<