ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దాడి చేసి బంగారు గొలుసు, నగదు చోరీ

ABN, Publish Date - Sep 11 , 2024 | 11:16 PM

ఆస్పత్రికి వెళ్లి వస్తున్న ఇద్దరు వ్యక్తులపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసి బంగారం, నగదుచోరీకి పాల్పడ్డారు.

పూడూరు, సెప్టెంబరు 11: ఆస్పత్రికి వెళ్లి వస్తున్న ఇద్దరు వ్యక్తులపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసి బంగారం, నగదుచోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. చెన్‌గోముల్‌ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్‌కు చెందిన ఊరడి సాయికుమార్‌ తన స్నేహితురాలితో కలిసి చేవెళ్లలోని మహేందర్‌రెడ్డి ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లాడు. చికిత్స అనంతరం తిరిగి బైక్‌పై వస్తున్నారు. మార్గమధ్యలో కండ్లపల్లి గేటు వద్ద ఫొటోలు దిగేందుకు బైక్‌ఆపి కొంత లోపలికి వెళుతుండగా ఒక నెంబర్‌ లేని బైక్‌పై ముగ్గురు వ్యక్తులు వచ్చారు. అందులో ఇద్దరు వ్యక్తుల సాయికుమార్‌, ఆయన స్నేహితురాలి వద్దకు వచ్చి ముఖానికి ఉన్నమాస్కులు తీయాలని బెదిరించారు. మరో వ్యక్తి రాడు తీసుకువచ్చి సాయికుమార్‌ తలపై కొట్టగా మరోవ్యక్తి కత్తితో బెదిరించి ఆయన స్నేహితురాలి మెడలో ఉన్న తులం బంగారు చైన్‌, రూ.4వేల నగదును లాక్కుని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెన్‌గోముల్‌ పోలీసులు తెలిపారు.

Updated Date - Sep 11 , 2024 | 11:16 PM

Advertising
Advertising