ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం.. ఇద్దరిపై కేసు
ABN, Publish Date - Oct 21 , 2024 | 11:56 PM
ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నించిన వ్యక్తులపై కేసు నమోదైన ఘటన చోటుచేసుకుంది. ఈమేరకు సోమవారం ఆర్‌జీఐఏ సీఐ బాల్‌రాజ్ వివరాలు తెలిపారు.
శంషాబాద్ రూరల్, అక్టోబరు 21(ఆంరఽధజ్యోతి) : ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నించిన వ్యక్తులపై కేసు నమోదైన ఘటన చోటుచేసుకుంది. ఈమేరకు సోమవారం ఆర్‌జీఐఏ సీఐ బాల్‌రాజ్ వివరాలు తెలిపారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సర్వేనెంబర్ 626/1లో అనంతయ్య, భీంరావులు జేసీబీలతో చదును చేస్తుండగా రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. దాంతో ఆర్‌ఐ కృష్ణ ఘటన స్థఽలానికి చేరుకుని ప్రభుత్వ భూమిని ఎందుకు కబ్జా చేస్తున్నావని వారించగా వారిద్దరు ఆర్‌ఐతో వాగ్వాదానికి దిగారు. రెవ్యూనూ అధికారులు ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేశారు. బోర్డును కబ్జాదారులు తొలగించారు. దీంతో ఆర్‌ఐ, ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, శంషాబాద్ మున్సిపల్, మండల పరిధిలోని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రవీందర్ దత్ హెచ్చరించారు. మున్సిపల్, మండలంలో ఎక్కడైన ప్రభుత్వ భూములను కబ్జా చేసిన్నట్లు తేలిస్తే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఎవరైన పదేపదే భూములను కబ్జాచేసినట్లు తేలిస్తే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Updated Date - Oct 21 , 2024 | 11:56 PM