ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గేదెను ఢీకొన్న బైక్‌.. మహిళ మృతి

ABN, Publish Date - Oct 20 , 2024 | 11:52 PM

గేదెను బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన జీనోమ్‌ వ్యాలీ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

మూడుచింతలపల్లి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): గేదెను బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన జీనోమ్‌ వ్యాలీ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లాకు చెందిన కుమార్‌ తన భార్య సంధ్య(26), బావమరిది ప్రవీణ్‌, కుమారుడు కౌశిక్‌లతో కలిసి కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌లోని అడ్డగుట్టకు బైక్‌పై వెళ్తున్నారు. మార్గమధ్యలో తుర్కపల్లి, మజీద్‌పూర్‌ మధ్య రాజీవ్‌ రహదారి పై ఫారెస్ట్‌ గెస్ట్‌ హౌస్‌ సమీపంలో రాగానే గేదె వీరి వాహనానికి అడ్డుగా వచ్చింది. దీంతో ప్రమాదవశాత్తు గేదెను ఢీ కొట్టడంతో కుమార్‌ బావమరిది ప్రవీణ్‌, భార్య సంధ్య, కుమారుడు కౌశిక్‌ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో సంధ్య తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Oct 20 , 2024 | 11:52 PM