ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బోరుబండి దందా!

ABN, Publish Date - Oct 23 , 2024 | 11:44 PM

పాత వాహనాల(బోరుబండ్లు)కు రంగులేసి, విడిభాగాలను మార్చి అక్రమంగా విదేశాలకు తరలిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు.

-పాతవాటికి రంగులేసి విదేశాల్లో విక్రయాలు

-అక్రమంగా తరలిస్తూ రూ.కోట్లు స్వాహా

-చాసిస్‌, ఇంజన్‌ నంబర్లకు నకిలీ ముద్రలు

-విడి భాగాలతో అసెంబ్లీ ఫిట్టింగ్‌తో తయారీ

-నగరం నుంచి పరిగి మీదుగా ముంబై పోర్టుకు

-అక్కడి నుంచి ఉగాండా, జాంబియాకు తరలింపు

-నెలలో 40 నుంచి 45 వాహనాల అమ్మకాలు!

-గత నెలలో పరిగిలో పట్టుబడిన బోరు డ్రిల్లింగ్‌ వాహనం

-ముందుకు సాగని పోలీసుల విచారణ

పాత వాహనాల(బోరుబండ్లు)కు రంగులేసి, విడిభాగాలను మార్చి అక్రమంగా విదేశాలకు తరలిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. ఇటీవల వికారాబాద్‌ జిల్లా పరిగిలో పోలీసుల తనిఖీల్లో సెప్టెంబర్‌ 28న ఓ బోరు డ్రిల్లింగ్‌ వాహనం పట్టుబడింది. ఎలాంటి పత్రాలు లేని ఆ వాహనాన్ని జాంబియా దేశానికి తరలిస్తున్నట్లు గుర్తించారు. అయితే ఈ వ్యవహరంపై పోలీసుల విచారణ జరిపి సూత్రధారులు ఎవరో ఇప్పటివరకు తేల్చలేకపోయారు. ఆలస్యానికి పోలీసులు, ఆర్టీఏ అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపిస్తూ తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పరిగి, అక్టోబరు23(ఆంధ్రజ్యోతి): బోరు డ్రిల్లింగ్‌ వాహనాల(బోరుబండి) దందాతో కొందరు పెద్ద మొత్తంలో కూడబెట్టుకుంటున్నారు. హైదరాబాద్‌, పరిసన ప్రాంతాల్లో కాలం చెల్లిన, పాతబడిన వాహనాలకు రంగులు వేసి కొత్తవాటిగా ముస్తాబు చేస్తున్నారు. విడిభాగాలను వేర్వేరు చోట్ల కొనుగోలు చేసి అసెంబ్లీ ఫిట్టింగ్‌తో కొత్త వాటిగా తయారు చేస్తున్నారు. అలా వాహనాన్ని తయారు చేయడానికి రూ.60 నుంచి రూ.75 లక్షల వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది. అదే వాహనం కంపెనీ నుంచి రావాలంటే రెండు కోట్లకుపైగా ఖర్చవుతుందని చెబుతున్నారు. ఇలా తక్కువ ఖర్చుతో తయారీ చేసిన వాహనాలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

ముఠాగా ఏర్పాడి వాహనాల తయారీ

పటాన్‌చెరు, నల్గొండ, పాలమూరు జిల్లాలకు చెందిన కొందరు ఒక ముఠాగా ఏర్పడి ఈ దందా నడిపిస్తున్నట్లు సమాచారం. పోలీసులకు పట్టుబడిన ఈ వాహనంలో పటాన్‌చెరులోని ఓ పేరున్న కంపెనీలో చాసిస్‌ నంబరు, ఇంజన్‌ నంబర్లతో పాటు, ప్రొడక్షన్‌ కంపెనీల పేరుతో ఫెక్‌ ముద్రలు వేయిస్తున్నట్లు తెలిసింది. అక్కడ నుంచి నగరంలోని వనస్థలిపురంలో పాత వాహనాలు, విడి భాగాలకు రంగులు వేస్తారు. అలాగే మరికొన్ని అసెంబ్లీ ఫిట్టింగ్‌తో బోరు డ్రిల్లింగ్‌ వాహనాలను కొత్తగా మారుస్తున్నట్లు సమాచారం. ఇలా తయారు చేసిన వాహనాలను షాద్‌నగర్‌- పరిగి మీదుగా ముంబయి పోర్టు తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఆఫ్రికాలోని జాంబియా, ఉగాండ, తదితర దేశాలకు తరలిస్తున్నారు. ఇలా నెలలో 40 నుంచి 45 వాహనాలను తరలిస్తున్నట్లు సమాచారం.

బోరు డ్రిల్లింగ్‌ వాహనం కొనాలంటే

కొత్తగా బోరు డ్రిల్లింగ్‌ వాహనాల తయారు చేయాలంటే తయారీ కంపెనీల నుంచి చెస్సు కొనుగోలు చేసి దానిపై కంప్రెషర్‌ బిగించాలి. ఆ తర్వాత మరో కంపెనీ ఏజెన్సీతో బాడీ తయారు చేయిస్తారు. ఈ క్రమంలో జీఎ్‌సటీ చెల్లించడంతోపాటు, టీఆర్‌ పొందాల్సి ఉంటుంది. టీఆర్‌ నంబరు ఆన్‌లైన్‌లో నమోదు కావాల్సి ఉంటుంది. అయితే పట్టుబడిన వాహనాలకు సంబంధించి కంప్రెషర్‌కు సంబంధించిన ఇన్‌వాయి్‌స తప్పా, ఏ పత్రాలు లేవు. అన్నీ సక్రమంగా చేస్తే ఒక్కో వాహనానికి విడిభాగాలతో కలిసి మొత్తం రూ.రెండు కోట్ల వరకు ఉంటుంది. మొత్తం ధరపై 18 శాతం జీఎస్టీ అంటే ఒక్కో వాహనానికి రూ.30 నుంచి రూ.36 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏం లేకుండా నిబంధనలకు విరుద్ధ్దంగా బోరు డ్రిల్లింగ్‌ వాహనాలను దర్జాగా తమకు నచ్చినట్లు తయారు చేసి అక్రమంగా విక్రయిస్తున్నారు. ఒక్కో వాహనం నుంచి కోటికిపైగానే అక్రమంగా లాభాలు గడిస్తున్నారు.

విదేశాలకు తరలింపు ఎందుకంటే..

ఇక్కడ కాలం చెల్లిన, అసెంబ్లీ ఫిట్టింగ్‌లతో తక్కువ ఖర్చుకు తయారు చేస్తున్నారు. తెలంగాణలో కొత్త బోరు డ్రిల్లింగ్‌ వాహనం కొనాలంటే దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుంది. ఈ దందా నడిపేవారు కాలం చెల్లిన వాహనాలు, పరికరాలతో రూ.60 నుంచి రూ.75 లక్షలకు కొత్త వాహనాలు సిద్ధం చేస్తున్నారు. ఆఫ్రికా, జాంబియా, ఉగాండా దేశాల్లో బోరు డ్రిల్లింగ్‌ వాహనాలకు బాగా డిమాండ్‌ ఉంటుంది. ఆ దేశాల్లో బోరు డ్రిల్లింగ్‌ వాహనాల తయారీ చాలా తక్కువ. ఒక వేళ తయారీ చేసినా రూ.ఐదు కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఇక్కడ రూ.75 లక్షలకు తయారు చేసిన వాహనాలను ఆయా దేశాల్లో రూ.2.50 కోట్ల నుంచి రూ.మూడు కోట్ల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం.

ఒక ఫీటు డ్రిల్లింగ్‌కు రూ.1500

అయితే ఆయా దేశాల్లో బోరుబండ్లకు ఇంత డిమాండ్‌ ఎందుకంటే మన దగ్గర బోరు డ్రిల్లింగ్‌ ఫీట్‌కు సుమారు రూ.60 నుంచి ప్రారంభవుతుంది. లోతును బట్టి ధర పెంచుతారు. ఆయా దేశాల్లో ఫీటు లోతు డ్రిల్లింగ్‌కు రూ.1500 నుంచి ప్రారంభం అవుతుందట. అందుకే బోరు డ్రిల్లింగ్‌ వాహనాలకు డిమాండ్‌ ఉంటుంది. పాతబండ్లను కొత్తగా తయారు చేసిన వాటిని తరలింపనుకు రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. పోర్టు నుంచి షిప్‌లో ఆయా దేశాలకు తరలించేందుకు రూ.10 నుంచి రూ.15 లక్షలు, నగరం నుంచి పోర్టుకు తరలించేందుకు వివిధ స్థాయిల్లో మరో రూ.10 లక్షలకుపైగా ముడుపులు ఇస్తున్నట్లు సమాచారం. పోర్టు నుంచి షిప్‌ తరలింపులో వివిధ రకాల నకిలీ పత్రాలతోనే మేనేజ్‌ చేసి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

పెద్దల అండదండలతోనే..

రాజకీయ పెద్దల అండదండలతో ఈ బోరు డ్రిల్లింగ్‌ వాహనాల అక్రమ తరలింపు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో ఏకంగా కోట్లలో లాభాలు ఉండడంతో ఈ దందాకు రాజకీయ పెద్దల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు, రవాణ శాఖ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడిలు ఉన్నందువల్లనే దాగుడు మూతలాడుతున్నారు. మొదట దొరికిన వాహనం గురించి తెల్చకముందే మరో వాహనం పట్టుబడింది. పరిగి పోలీసుల స్వాధీనంలో ప్రస్తుతం రెండు బోరు డ్రిల్లింగ్‌ వాహనాలు ఉన్నాయి. గతేడాది క్రితం కూడా పరిగిలో ఇలాంటి వాహనాలు పట్టుబడితే రాజకీయ ఒత్తిళ్లతోనే వదిలిపెట్టారాన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా రెండు వాహనాలు పట్టుబడిన తర్వాత కూడా రాత్రి సమయాల్లో ఇంకా ఇలాంటి వాహనాలను పరిగి మార్గాన తరలిస్తున్నట్లు సమాచారం.

Updated Date - Oct 24 , 2024 | 06:57 AM