ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కేబుల్‌ వైర్లు.. బీకేర్‌ఫుల్‌

ABN, Publish Date - Nov 14 , 2024 | 12:14 AM

నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రైవేట్‌ సంస్థలు విద్యుత్‌ శాఖ స్తంభాలను తమ సొంతానికి వాడుకుంటున్నాయి.

మేడ్చల్‌లో విద్యుత్‌ స్తంభాలకు ఇష్టానుసారంగా కట్టిన కేబుల్‌ వైర్లు

  • విచ్చలవిడిగా విద్యుత్‌ స్తంభాలను వాడుకుంటున్న ఇంటర్నెట్‌, కేబుల్‌ టీవీల యాజమాన్యాలు

  • మరమ్మతులకు ఇబ్బంది పడుతున్న లైన్‌మెన్లు

  • కొన్నిచోట్ల ప్రమాదకరంగా ఉన్న కేబుల్‌ వైర్లు

మేడ్చల్‌ టౌన్‌, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రైవేట్‌ సంస్థలు విద్యుత్‌ శాఖ స్తంభాలను తమ సొంతానికి వాడుకుంటున్నాయి. వాడవాడలా విద్యుత్‌ సరఫరాకు ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేస్తుండగా.. కొన్ని ప్రైవేటు ఇంటర్నెట్‌, కేబుల్‌ టీవీ సంస్థలు ఇష్టారాజ్యంగా కేబుళ్లను స్తంభాల ద్వారా అనుసంధానిస్తున్నాయి. ఫలితంగా విద్యుత్‌ స్తంభాల వద్ద ఏదైనా సమస్య ఎదురైతే ట్రాన్స్‌కో సిబ్బంది మరమ్మతులు చేయలేకపోతున్నారు. అనుమతులు లేకుండా కేబుళ్లు ఏర్పాటు చేస్తే సదరు వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్న నిబంధన ఉన్నప్పటికీ విద్యుత్‌ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రైవేటు సంస్థల కేబుల్‌ విస్తరణ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతోందన్న ఆరోపణలు వినబడుతున్నాయి. మేడ్చల్‌ పట్టణంలో ఏర్పాటుచేసిన త్రీ ఫేస్‌, టూఫేస్‌, చివరికి హైటెన్షన్‌ స్తంభాలను కూడా ప్రైవేటు సంస్థల యాజమాన్యం అనధికారికంగా వాడుకుంటోంది. కాగా, కేబుళ్ల కారణంగా కొన్ని ప్రాంతాల్లో స్తంభాలు నేలకొరుగుతున్నాయి. పలుచోట్ల ప్రమాదాలు జరుగుతుండటంతో ఇటీవ ట్రాన్స్‌కో ఎండీ అనధికరికంగా విద్యుత్‌ స్తంభాలకు కట్టిన కేబుళ్లను తొలగించాలని హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ ప్రైవేటు సంస్థలు మాత్రం పట్టించుకోవటం లేదు. దాంతో ఒకరిని చూసి మరొకరు ఇష్టారాజ్యంగా స్తంభాలను కేబుళ్ల కొరకు వాడుకుంటున్నారు.

లైన్‌మెన్లకు ఇబ్బందిగా మారిన కేబుళ్లు

కాలనీల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగినప్పుడు లైన్‌మెన్లు తనిఖీ చేసి మరమ్మతులు చేయడం సహజం. కాగా, ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేసిన కేబుళ్లతో వారు స్తంభాలు ఎక్కాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉంటుందో తెలియని పరిస్థితి. తరచూ విద్యుత్‌ తీగల్లో స్పార్క్‌ వచ్చి తీగలు కాలి కేబుళ్లపై పడి మంటలు చెలరేగిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్‌ శాఖ తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్తంభాలకు కుప్పలు తెప్పలుగా కడుతున్న కేబుల్‌ వైర్లతో నష్టం వాటిల్లుతునప్పటికీ అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తాం: రాజమల్లేష్‌, ఏడీఈ

కేబుల్‌ వైర్ల ఏర్పాటుకు విద్యుత్‌ స్థంభాలను వినియోగించడం సరికాదు. వాటని తొలగించటానికి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తాం. కేబుళ్ల కారణంగా లైన్‌మెన్లు మరమ్మతులు చేయడం కష్టంగా మారింది. కేబుళ్లు ఏర్పాటు చేసిన వారికి నోటీసులు జారీ చేస్తాం. వాటిని తొలగించటానికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతాం.

Updated Date - Nov 14 , 2024 | 12:14 AM