సెల్‌టవర్ బ్యాటరీ బ్యాంక్‌లో సెల్స్ చోరీ
ABN, Publish Date - Sep 16 , 2024 | 11:42 PM
సెల్‌టవర్ బ్యాటరీ బ్యాంక్‌లోని 24సెల్స్‌ను గుర్తుతెలియని వ్యక్తులు చోరీచేశారు.
ధారూరు, సెప్టెంబరు 16: సెల్‌టవర్ బ్యాటరీ బ్యాంక్‌లోని 24సెల్స్‌ను గుర్తుతెలియని వ్యక్తులు చోరీచేశారు. ఈ ఘటన ధారూరులోని టీవరల్డ్ సమీపంలోని ఏటీసీ 2వ టవర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వేణుగోపాల్‌గౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధారూరులో సెల్‌టవర్, బ్యాటరీ బ్యాంక్ రెండింటిని కలిపి ఫెన్సింగ్ వేసి గేట్ అమర్చి తాళంవేసి ఉంటుంది. కాగా ఈనెల 15(ఆదివారం)న సాయంత్రం హైదరాబాద్ సర్వీస్ ఆఫీస్ నుంచి టెక్నీషియన్‌కు ఫోన్‌చేసి టవర్‌లో సర్వీస్ డౌన్ అయిందని సమాచారం ఇచ్చారు. తాండూర్ నుంచి ధారూరుకు వచ్చిన టెక్నీషియన్ అనిల్‌కుమార్ టవర్ వద్దకువెళ్లి చూడగా బ్యాటరీ బ్యాంక్‌లోని 24సెల్స్ కనిపించలేదు. టవర్‌గేట్‌కు ఉన్న తాళం తీసి తగిలేసి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఆయన సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన 24సెల్స్ విలువ రూ.60వేలు ఉంటుందని టెక్నీషియన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Updated Date - Sep 16 , 2024 | 11:42 PM