ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అనుమతుల్లేకుండా క్లినిక్‌ నిర్వహణ..

ABN, Publish Date - Dec 07 , 2024 | 12:24 AM

ఎలాంటి అనుమతులు లేని పరిగిలోని గ్లోబల్‌ క్లినిక్‌ను సీజ్‌ చేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో జీవరాజ్‌ తెలిపారు. శుక్రవారం డిప్యూటీ డీఎంహెచ్‌వో, డిప్యూటీ డెమో శ్రీనివాసుల టీం తనిఖీ చేశారు.

అర్హత లేకున్నా వైద్యం

పరిగిలో క్లినిక్‌ సీజ్‌.. మరో దానికి నోటీసులు

అర్హత, రిజిస్ట్రేషన్‌ లేకుండా వైద్యం చేయొద్దు

డిప్యూటీ డీఎంహెచ్‌వో జీవరాజ్‌

పరిగి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఎలాంటి అనుమతులు లేని పరిగిలోని గ్లోబల్‌ క్లినిక్‌ను సీజ్‌ చేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో జీవరాజ్‌ తెలిపారు. శుక్రవారం డిప్యూటీ డీఎంహెచ్‌వో, డిప్యూటీ డెమో శ్రీనివాసుల టీం తనిఖీ చేశారు. గ్లోబల్‌ క్లినిక్‌లో ఎలాంటి విద్యార్హతలు, రిజిస్ట్రేషన్‌ లేకుండా ఎంబీబీఎస్‌ డాక్టర్‌గా చలామణి అవుతున్న రాజు అనే వ్యక్తి క్లినిక్‌ నిర్వహించడాన్ని గుర్తించారు. విద్యార్హతలకు సంబంధించి సర్టిఫికెట్లు లేనందున క్లినిక్‌ను సీజ్‌ చేసినట్లు తెలిపారు. అలాగే లోటస్‌ క్లినిక్‌కు రిజిస్ట్రేషన్‌ లేనందుకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. విద్యార్హతలు, రిజిస్ట్రేషన్‌ లేకుండా క్లినిక్‌లు నిర్వహిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అర్హతలు ఉన్నవారు జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో అనుమతి పొందిన తర్వాతనే క్లినిక్‌లు నిర్వహించాలని సూచించారు. లేనిచో సీజ్‌ చేస్తామని స్పష్టం చేశారు.

Updated Date - Dec 07 , 2024 | 12:24 AM