CM Revanth Reddy: గీత కార్మికులకు నేడు కాటమయ్య రక్ష కిట్ల పింపిణి..
ABN, Publish Date - Jul 14 , 2024 | 07:12 AM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో ఆయన పర్యటించనున్నారు. లష్కర్‌గూడలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నందున దీనికి సంబంధించిన ఏర్పాట్లను బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డితో కలిసి శనివారం పరిశీలించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇక నుంచి వారానికొక జిల్లాలో పర్యటించనున్నారు. కలెక్టర్లు కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రజలతో మమేకం కావాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో సీఎం కూడా వారానికొక జిల్లాలో పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రజలతో కలిసి పని చేసినప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం రంగారెడ్డి జిల్లా (Rangareddy Dist.,) అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో ఆయన పర్యటించనున్నారు.
లష్కర్‌గూడలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నందున దీనికి సంబంధించిన ఏర్పాట్లను బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డితో కలిసి శనివారం పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా కల్లు గీత కార్మికుల భద్రత కోసం బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో కాటమయ్య రక్షణ కవచాలను పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి లష్కర్‌గూడలో ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పలువురు మంత్రులతో కలిసి కాటమయ్య రక్ష కిట్లను అందజేయనున్నారు. సుమారు 60 మంది గీత కార్మికులకు సీఎం చేతుల మీదుగా వీటి పంపిణీ చేయనున్నారు. అనంతరం వారితో కలిసి సహ పంక్తి భోజనం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది గీత కార్మికులతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 14 , 2024 | 07:26 AM