ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాధిత కుటుంబానికి పరిహారం అందించాలి

ABN, Publish Date - Nov 24 , 2024 | 12:16 AM

నాలుగేళ్ల క్రితం బేగంపేట, బాచుపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు వరద నీటిలో మృతి చెందారని, వారి కుటుంబాలకు పరిహారం అందించాలని ఎమ్మెల్యే సబితారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు శనివారం బాచుపల్లికి చెందిన మృతుడి తల్లి పి.అనిత ఆ గ్రామ మాజీ సర్పంచ్‌ యాలాల శ్రీనివా్‌సతో కలిసి మీర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లి తనకు మంజూరైన డబ్బులు అకౌంట్‌లో పడలేదని మొరపెట్టుకున్నారు.

కందుకూరు, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): నాలుగేళ్ల క్రితం బేగంపేట, బాచుపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు వరద నీటిలో మృతి చెందారని, వారి కుటుంబాలకు పరిహారం అందించాలని ఎమ్మెల్యే సబితారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు శనివారం బాచుపల్లికి చెందిన మృతుడి తల్లి పి.అనిత ఆ గ్రామ మాజీ సర్పంచ్‌ యాలాల శ్రీనివా్‌సతో కలిసి మీర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లి తనకు మంజూరైన డబ్బులు అకౌంట్‌లో పడలేదని మొరపెట్టుకున్నారు. దాంతో సబిత స్పందించి బేగంపేటకు చెందిన మధారం వెంకటేష్‌, బాచుపల్లి గ్రామానికి చెందిన పి.రాఘవేందర్‌లు నాలుగు సంవత్సరాలక్రితం అబ్ధుల్లాపూర్‌మెట్‌ మండల పరిసర ప్రాంతంలో వరదనీటిలో కొట్టుకు పోయి మృతి చెందినట్లు గుర్తుచేశారు. ఒక్కో కుటుంబానికి రూ.4లక్షల చొప్పున మంజూరు చేశారని, వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేయకపోవడంతో రెండు కుటుంబాల సభ్యులు ఇబ్బందులకు గురౌతున్నట్లు తెలిపారు. డీఆర్వోకు ఫోన్‌చేసి వారి ఖాతాల్లో పరిహారం డబ్బులను వేయాలని తెలిపారు.

Updated Date - Nov 24 , 2024 | 12:16 AM