ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాంగ్రెస్‌ది గ్యారంటీల గారడీ : బీజేపీ

ABN, Publish Date - Dec 07 , 2024 | 12:23 AM

అధికారమిస్తే ప్రజల బతుకులు మారుస్తామని ఎన్నికల ముందు ఆరు అబద్ధాలు ఆడిన కాంగ్రెస్‌ పార్టీ.. అధికారంలోకి రాగానే 66 మోసాలకు పాల్పడుతున్నదని బీజేపీ నాయకులు విమర్శించారు.

పోస్టర్‌ను విడుదల చేస్తున్న బీజేపీ నాయకులు

షాద్‌నగర్‌ అర్బన్‌, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): అధికారమిస్తే ప్రజల బతుకులు మారుస్తామని ఎన్నికల ముందు ఆరు అబద్ధాలు ఆడిన కాంగ్రెస్‌ పార్టీ.. అధికారంలోకి రాగానే 66 మోసాలకు పాల్పడుతున్నదని బీజేపీ నాయకులు విమర్శించారు. షాద్‌నగర్‌లోని ఏబీ కాంప్లెక్స్‌లో శుక్రవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో శనివారం సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించే బీజేపీ బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి, అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డిలు మాట్లాడారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ రైతులను, మహిళలను, నిరుద్యోగులను, యువతను, విద్యార్థులను మోసగిస్తూ పోతున్నదని విమర్శించారు. రాష్ట్రంలో పాలకులు మారారే తప్ప.. ప్రజల బతుకులు మారలేదన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయలేదని, రైతు బంధు, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500లకే వంటగ్యాస్‌ సిలిండర్‌ వంటి ఫథకాలను ఇవ్వకుండానే సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్ట ప్రజల్లో చైతన్యం తేవడానికి శనివారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తున్నారని, పార్టీ క్యాడర్‌తో పాటు ప్రజలు అధిక సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు. నాయకులు చెంది తిరుపతిరెడ్డి, దేపల్లి అశోక్‌గౌడ్‌, కక్కునూరి వెంకటేష్‌ గుప్తా, మోటే శ్రీనివాస్‌, మఠం రుషీకేష్‌, హరిభూషణ్‌ పటేల్‌, ఎంకనోళ్ళ వెంకటేష్‌, పసుల ప్రశాంత్‌ తదితరులున్నారు.

కడ్తాల్‌ : కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం గారడీలతో ప్రజలను మోసగించిందని ఎస్టీ మోర్చా మండలాధ్యక్షుడు నేనావత్‌ ప్రేమ్‌కుమార్‌ అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ఏడాదిలో చేసిన వైఫల్యాలను ప్రజలకు తెలిసేలా శనివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభకు సంబంధించి సన్నాహక సమావేశం కడ్తాల మండల కేంద్రంలో నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:23 AM