ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రుణమాఫీ కాలేదు.. న్యాయం చేయండి

ABN, Publish Date - Sep 07 , 2024 | 12:22 AM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీకి అన్ని అర్హతలున్నా రుణమాఫీ కాలేదని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

రుణమాఫీ వివరాలు తెలుసుకుంటున్న రైతు వెంకటయ్య

  • బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని రైతు ఆవేదన

  • అధికారుల తప్పిదం అంటున్న బ్యాంకర్లు

తాండూరు రూరల్‌, సెప్టెంబరు 6: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీకి అన్ని అర్హతలున్నా రుణమాఫీ కాలేదని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. బ్యాంకులు, వ్యవసాయశాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు. ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తంచేశాడు. వివరాలిలా ఉన్నాయి. తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని మల్‌రెడ్డిపల్లికి చెందిన రైతు దస్తగిరి వెంకటయ్యకు సంబంధించి తాండూరు మండలం అంతారం పరిధిలోని సర్వేనెంబర్‌-297, 298లో దాదాపు ఐదెకరాల పొలం ఉంది. ఈ భూమి పాస్‌పుస్తకాలు పెట్టి తాండూరులోని యూనియన్‌ బ్యాంకులో రూ.లక్షా 60వేల రుణం తీసుకున్నాడు. తీసుకున్న రుణంతో పాటు మిత్తి చెల్లించి మరోసారి రూ.లక్షా 30వేలు రుణం పొందాడు. అదేవిధంగా చెన్‌గే్‌షపూర్‌లోని సర్వేనెంబర్‌-109 ఎకరా పొలానికి సంబంధించి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో రూ.42వేలు రుణం తీసుకున్నాడు. మొత్తం రూ.2లక్షలపైనే రుణం ఉంది. అయినప్పటికీ రైతు వెంకటయ్యకు రుణమాఫీ కాలేదు. ఎందుకు కాలేదని రైతు వెంకటయ్య వ్యవసాయ కార్యాలయానికి వెళ్లాడు. అయితే తనకు సంబంధించిన రెండు ఖాతాల్లో అప్పు ఉండగా, మరో ఖాతా నారాయణపేట్‌ జిల్లా ఆత్మకూర్‌ మండలానికి చెందిన చిన్న అంజన్నకు సంబంధించిన వివరాలు నమోదు అయ్యాయి. మూడు ఖాతాలు కలిపి రూ.3లక్షల 95వేలు వస్తోంది. దీంతో రైతు వెంకటయ్యకు రుణమాఫీ కావడం లేదు. బ్యాంక్‌కు వెళ్లి అడిగితే మక్తల్‌ బ్యాంక్‌కు వెళ్లమని చెప్పడంతో అక్కడికి కూడా వెళ్లాడు. గత 15రోజుల నుంచి జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంతోపాటు కలెక్టర్‌, తాండూరు ఏడీఏతోపాటు తాండూరు బ్యాంకు, మక్తల్‌ బ్యాంకు తిరుగుతున్నాడు. వ్యవసాయ శాఖ అధికారుల తప్పిదం వల్లే ఇలా జరిగిందని బ్యాంకర్లు చెబుతున్నారని బాధిత రైతు తెలిపాడు. శుక్రవారం అంతారం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఏడీఏ రుద్రమూర్తి, ఏఈవో శివకుమార్‌ను కలిసి విన్నవించుకున్నాడు. అయితే వారు బ్యాంకుకు వెళ్లాలని చెబుతున్నారని వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.

Updated Date - Sep 07 , 2024 | 12:22 AM

Advertising
Advertising