ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బీజేపీ సర్కార్‌తోనే అభివృద్ధి

ABN, Publish Date - Oct 23 , 2024 | 11:51 PM

బీజేపీ సర్కార్‌తోనే దేశం అభివృద్ధిలో ముందుకు సాగుతోందని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం అన్నారు. బుధవారం చేవెళ్ల మండల పరిధిలోని రేగడిఘనాపూర్‌, ఖానాపూర్‌ గ్రామాల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.

కొత్తూర్‌ : తీగాపూర్‌లో సభ్యత్వాలు అందజేస్తున్న అందె బాబయ్య

చేవెళ్ల, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): బీజేపీ సర్కార్‌తోనే దేశం అభివృద్ధిలో ముందుకు సాగుతోందని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం అన్నారు. బుధవారం చేవెళ్ల మండల పరిధిలోని రేగడిఘనాపూర్‌, ఖానాపూర్‌ గ్రామాల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చేవెళ్లలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో బీజేపీని బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యకర్తలు ఉత్సహంగా పాల్గొని సభ్యత్వాన్ని గతంలో కంటే రెట్టింపుగా చేయాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆంజనేయులుగౌడ్‌, బీజేపీ జిల్లా యుత్‌ నాయకుడు వైభవ్‌రెడ్డి, మండలాధ్యక్షుడు పాండురంగారెడ్డి, ఉపాధ్యక్షుడు గౌండ్ల కృష్ణగౌడ్‌, ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి, సీనియర్‌ నాయకులు దేవుని శర్వలింగం, శంకర్‌, కటికే శ్రీరాం, ఇంద్రాసేనారెడ్డి, కుమ్మరి కృష్ణ తదితరులున్నారు.

కేంద్ర పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

కొత్తూర్‌, అక్టోబరు 23 : (ఆంధ్రజ్యోతి): నిరుపేదలు కేంద్ర సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు అందె బాబయ్య తెలిపారు. మండల పరిధిలోని తీగాపూర్‌లో గ్రామాధ్యక్షుడు కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి బాబయ్య హాజరై సభ్యత్వాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ మోదీతోనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. బీజేపీ సభ్యత్వానికి ప్రజల నుంచి మంచి స్పందన ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు మంగలి రమేష్‌, నాయకులు బావండ్ల మాణిక్యం, గణేష్‌, మహేందర్‌రెడ్డి, శ్రీశైలం, శివలింగం, గోవర్దన్‌, లక్ష్మణ్‌, మహేందర్‌, రవి, సాయికిరణ్‌, మధు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 11:51 PM