మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
ABN, Publish Date - Nov 15 , 2024 | 12:03 AM
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యమైన ఘటన శామీర్‌పేట్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది.
మూడుచింతలపల్లి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యమైన ఘటన శామీర్‌పేట్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వనపర్తి గ్రామానికి చెందిన తిరుపతి(37) వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. భార్యలతో గొడవల కారణంగా తిరుపతి ఒక్కడే ఉంటున్నాడు. ఈనెల 4వ తేదీన తిరుపతి ఉప్పర్‌పల్లిలోని అతడి అన్న అబ్దుల్లా ఇంటికి వచ్చాడు. అతడికి మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో నగరంలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. వైద్యులు రెండు రోజుల తర్వాత తీసుకురమ్మని చెప్పడంతో ఇంటికి తీసుకెళ్లారు. తిరుపతి మార్కెట్‌కి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు శామీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - Nov 15 , 2024 | 12:03 AM