వ్యక్తి అదృశ్యం
ABN, Publish Date - Oct 19 , 2024 | 11:47 PM
కొత్తూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్‌నకు చెందిన పట్నం మణిరత్నం(35) అదృశ్యమైనట్లు ఎస్సై జి. శ్రీనివాస్ తెలిపారు.
కొత్తూర్, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): కొత్తూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్‌నకు చెందిన పట్నం మణిరత్నం(35) అదృశ్యమైనట్లు ఎస్సై జి. శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 15న అరుణాచలం యాత్రకు వెళ్లిన మణి రత్నం నేటి వరకు కూడా ఇంటికి తిరిగి రాలేదని తెలిపారు. మణిరత్నం కోసం కుటుంబసభ్యులు గాలింపులు జరిపినా.. ఫలితం లేకపోయిందన్నా రు. మణిరత్నం తండ్రి నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శనివారం తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 8712568270 నెంబర్‌కు సమాచారం అందించాలని ఎస్సై తెలిపారు.
Updated Date - Oct 19 , 2024 | 11:47 PM