ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హెచ్‌ఎండీఏలో మేడ్చల్‌ జోన్‌ విభజన

ABN, Publish Date - Aug 09 , 2024 | 11:42 PM

నగరశివారు చుట్టూ విస్తరించి ఉన్న మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో మేడ్చల్‌ జోన్‌ రెండుగా విభజిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు.

మేడ్చల్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నగరశివారు చుట్టూ విస్తరించి ఉన్న మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో మేడ్చల్‌ జోన్‌ రెండుగా విభజిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలో హెచ్‌ఎండీఏ పరిధిలో ఇప్పటి వరకు ఘట్‌కేసర్‌, మేడ్చల్‌ జోన్లు ఉండగా ఘట్‌కేసర్‌ జోన్‌ను యథావిధిగా ఉంచి, మేడ్చల్‌ను రెండు జోన్‌లుగా విభజించారు. త్వరలో ఆర్‌ఆర్‌ఆర్‌ మొత్తం హెచ్‌ఎండీఏ పరిధిలోకి తెచ్చేందుకు ప్రణాళికలో భాగంగా మేడ్చల్‌ను రెండుగా విభజించినట్లు తెలిసింది. మేడ్చల్‌జోన్‌ పరిధి ఎక్కువగా ఉండటంతో సేవల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. జోన్‌ను విభజించి అదనపు సిబ్బంది నియామకానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మేడ్చల్‌ జోన్‌-1లో బాచుపల్లి, గుండ్లపోచంపల్లి, నర్సాపూర్‌, శామీర్‌పేట, శివంపేట్‌, తూప్రాన్‌, మనోహరాబాద్‌ ప్రాంతాలు ఉండగా, మేడ్చల్‌జోన్‌-2లో కొంపల్లి, మేడ్చల్‌, పీఎ్‌ఫయూ, గ్రిడ్‌రోడ్‌, ఉప్పల్‌ భగాయత్‌, దుండిగల్‌, గండిమైసమ్మ, ములుగు, వర్గల్‌, కాప్రా ప్రాంతాలున్నాయి. మేడ్చల్‌జోన్‌-1 ప్లానింగ్‌ అధికారికగా గోపిక రమ్మ, మేడ్చల్‌ జోన్‌-2 ప్లానింగ్‌ అధికారిగా కె.శాలినిలకు బాధ్యతలు అప్పగించారు.

Updated Date - Aug 09 , 2024 | 11:42 PM

Advertising
Advertising
<