ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైతులకు నష్టం కలిగించొద్దు

ABN, Publish Date - Nov 14 , 2024 | 12:10 AM

రైతులకు ఎలాంటి నష్టం జరుగకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యు. రమేష్‌ కుమార్‌, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు సాహ్రు శ్రీలత డిమాండ్‌ చేశారు.

బొంరా్‌సపేట్‌ పోలీసుల అదుపులో బీజేపీ తాండూరు నేతలు

తాండూరు, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఎలాంటి నష్టం జరుగకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యు. రమేష్‌ కుమార్‌, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు సాహ్రు శ్రీలత డిమాండ్‌ చేశారు. తాండూరు నుంచి దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో బుధవారం రైతులను పరామర్శించేందుకు వెళ్తుండగా మార్గమధ్యలో తుంకిమెట్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సీఎం సొంత నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి ఇలా అక్రమంగా అరెస్టులు చేసి భయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. రైతులను అక్రమంగా అరెస్ట్‌ చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వారి వెంట బీజేపీ నాయకులు బంటు రమేష్‌, బంటారం భద్రేశ్వర్‌, బాబయ్య, నర్సింహులు, రాము సాగర్‌ ఉన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 12:10 AM