ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నూలు వడకక.. పూట గడవక!

ABN, Publish Date - Oct 19 , 2024 | 11:36 PM

ఒకప్పుడు చేనేత వైభవాన్ని కళ్లకు కట్టారు.. ఇక్కడ తయారు చేసిన వస్ర్తాల నైపుణ్యాన్ని అంగళ్లు పెట్టి మరీ ప్రపంచానికి పరిచయం చేశారు చౌదరిగూడ చేనేత కార్మికులు.

చేయూత కరువైన చేనేత బతుకులు

ఒకప్పుడు వైభవం.. నేడు కూటి కోసం తిప్పలు

సంతల్లో పొగాకు, తమలపాకుల వ్యాపారం

చౌదరిగూడలో చేనేత కార్మికుల బతుకు ఛిద్రం

రోడ్డుపై పొగాకు అమ్ముకొని జీవిస్తున్నాం

ఈ చేనేత కార్మికుడి పేరు అంజయ్య. వయస్సు 64ఏళ్లు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ కుటుంబం 30 ఏళ్లకు పైగా చేనేత బట్టలు నేసి సొంతంగా వ్యాపారం నిర్వహించేది. అందులోనే లాభాలను గడిస్తూ దర్జాగా బతికేవారు. కాలక్రమేణా వస్త్ర వ్యాపారంలోకి కార్పొరేట్‌ సంస్థలు రావడంతో వారి జీవనోపాధి దెబ్బతిన్నది. దీంతో పూట గడవడం కూడా కష్టంగా మారింది. కొన్నాళ్ల పాటు కూలి చేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నారు. ఆ పనులు కూడా దొరకడం కష్టమైంది. దీంతో ఆయన తన భార్యతో కలిసి పొగాకు, తమలపాకులు, సున్నం, కాసు తదితర వస్తువులను కొనుగోలు చేసి సంత రోజుల్లో పరిగి, మన్నెగూడ, చౌదరిగూడ, రంగాపురంలో విక్రయిస్తున్నాడు. రోజూ ఊళ్లు తిరుగుతూ విక్రయాలు జరిగితేనే పూట గడిచేది. తమకు చేనేత రంగం తప్ప ఇతర పనులు రాకపోవడం వల్లనే ఇలా బతకాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

షాద్‌నగర్‌/ చౌదరిగూడ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : ఒకప్పుడు చేనేత వైభవాన్ని కళ్లకు కట్టారు.. ఇక్కడ తయారు చేసిన వస్ర్తాల నైపుణ్యాన్ని అంగళ్లు పెట్టి మరీ ప్రపంచానికి పరిచయం చేశారు చౌదరిగూడ చేనేత కార్మికులు. ఇదంతా గతం.. ఇక వర్తమానంలోకి వస్తే కూటి కోసం కోటి తిప్పలు పడుతూ ఉపాధి వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలు, రాష్ర్టాలకు వలసబోతున్నారు. నాడు చేనేత వైభవానికి ప్రతీకగా నిలిచిన చౌదరిగూడ మండల కేంద్రం నేడు వెలవెలబోతోంది. స్థానిక చేనేత కార్మికుల కన్నీటి గాథలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

చౌదరిగూడ మండల కేంద్రం, ఇంద్రానగర్‌ జంట గ్రామాలు. ఈ గ్రామాల్లో ఎక్కువ శాతం మందికి చేనేత వృత్తే ఆధారం. ఈ రెండు గ్రామాల్లో సుమారు 250 కుటుంబాలు ఈ వృత్తి మీద ఆధారపడ్డాయి. అద్భుతమైన పట్టు చీరలు, పట్టు పంచెలు, ఇతర వస్ర్తాలు, పట్టు కండువాలను కొనుగోలు చేయడానికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో సహా ఇతర ప్రాంతాల వస్త్ర వ్యాపారులు వచ్చి ఇక్కడి నేతన్నలు నేసిన వస్ర్తాలన కొనుగోలు చేసేవారు. దీంతో చౌదరిగూడ మండలం చేనేత వృత్తి ప్రాధాన్యత సంతరించుకుంది.

కరువైన ప్రోత్సాహం

కాలక్రమేణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడం, నూతన వస్త్ర సాంప్రదాయాలు మర్కెట్‌లోకి రావడంతో చేనేత పరిశ్రమ చతికిల పడింది. దీంతో చేనేత కార్మికులంతా కూలి పనుల కోసం స్వరాష్ట్రంతో పాటు, ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లారు. ఉన్న ఊరును వదిలి ఎక్కడికి వెళ్లలేక ఉన్న కొన్ని కుటుంబాలు మాత్రం ఇక్కడే కూలీలుగా మారారు. ఒకప్పుడు కేవలం 200 మీటర్ల దారం నేయడానికి రూ. 800 ఖర్చు వచ్చేదని, అందులో తమకు రూ. 200 మిగిలేదని, అలా రోజుకు కనీసం రూ.400 నుంచి రూ.800 వరకు సంపాదించే వారమని చెబుతున్నారు. కానీ ప్రస్తుతం రోజంతా కష్టపడ్డా కనీసం రూ.500 కూలి కూడా రావడం కష్టంగా మారిందని చేనేత కార్మికులు ఆవేదన వ్యకం చేస్తున్నారు.

కుటుంబ పోషణ భారమైంది

ఈ చేనేత కార్మికుడి పేరు కొంగరి నారాయణ. చౌదరిగూడ గ్రామం. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు. చేనేత వస్ర్తాలను తయారు చేయడంలో ఆయనది అందవేసిన చెయ్యి. పట్టు చీరలు, వస్ర్తాల తయారీతో రోజుకు రూ.1,500 వరకు సంపాదిస్తూ తన కుటుంబంతో ఆనందంగా ఉండేవాడు. కాలక్రమేనా మార్కెట్‌లోకి రెడీమేడ్‌ దుస్తులు రావడం, కార్పొరేట్‌ సంస్థలు కూడా వస్త్ర వ్యాపారంలోకి అడుగు పెట్టడంతో చేనేత రంగం చతికిల పడింది. వస్ర్తాలు నేసినా ఎవరూ కొనడానికి ముందుకు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో చేనేత మగ్గాలను అటకెక్కించి తన కుటుంబంతో సహా అందరూ కూలి పనులకు వెళ్తున్నారు. పిల్లల చదువులు కూడా అర్థంతరంగా నిలిచిపోయాయి. కూలి పనులు కూడా అంతంత మాత్రంగానే దొరుకుతుండటంతో జీవనం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సహకారాన్ని అందించి చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నారు.

-కొంగరి నారాయణ, చేనేత కార్మికుడు

ప్రభుత్వం ఆదుకోవాలి

చేనేత వస్త్రాలతో కళకళలాడే మా ఇల్లు.. నేడు జీవనాధారం లేక వెలవెలబోతుంది. నా భర్తతో కలిసి వస్ర్తాలను తయారు చేసేవాళ్లం. అప్పట్లోనే ఖర్చులు పోను రోజుకు రూ. వెయ్యి నుంచి రూ.1500 సంపాదించే వాళ్లం. కానీ ప్రస్తుతం జీవనాధారం లేక బతుకు భారంగా మారింది. మా పిల్లలకు కూడా మంచి విద్యను అందించలేకపోయాం. పనిలేక కూలీలుగా మారినం. ప్రభుత్వం కనికరించి చేనేత కార్మికులను ఆదుకోవాలి.

- చంద్రమ్మ, చేనేత కార్మికురాలు

Updated Date - Oct 20 , 2024 | 12:09 AM