ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కరువు కాటు!

ABN, Publish Date - Mar 25 , 2024 | 11:28 PM

ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు అన్నదాతలకు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. కాలంలో వానలు కురియక భూగర్భ జలాలు అడుగంటి పంటలెండుతున్నాయి

ట్యాంకర్‌తో వరికి నీరు పెడుతున్న రైతు జెనిగె సత్తయ్య

అడుగంటిన భూగర్భ జలాలు.. ఎండుతున్న పంటలు

కాపాడుకునేందుకు అన్నదాతల పాట్లు

ట్యాంకర్లతో నీరు పారిస్తున్న వైనం

మంచాల మండలంలో వందల ఎకరాల్లో ఎండుతున్న పంటలు

మంచాల, మార్చి 25 : ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు అన్నదాతలకు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. కాలంలో వానలు కురియక భూగర్భ జలాలు అడుగంటి పంటలెండుతున్నాయి. మంచాల మండలంలో బోరు నీటితో రబీలో వరి, కూరగాయ తదితర పంటలు సాగుచేశారు. బోర్లలో నీటిలభ్యత రోజురోజుకూ తగ్గిపోతూ నీరందక పంటలు ఎండుతున్నాయి. వేసిన కొద్దిపాటి పంటలు కూడా ఎండుముఖం పడుతుండడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు చేయని ప్రయత్నాలు లేవు. పంట కాపాడుకునేందుకు అప్పులుచేసి బోర్లు వేస్తున్నారు. కరువుతో రైతుల ప్రయత్నాలు ఫలించడంలేదు. వేస్తున్న బోర్లలో దుమ్మే రేగుతోంది కానీ నీటి జాడ కన్పించడం లేదు. దీంతో చేసేదేమీ లేక రైతులు ఎండుతున్న పంటలను పశువుల మేతకు వదిలేస్తున్నారు. ఈనుతున్న పంటలను కాపాడుకునేందుకు కొందరు రైతులు ట్యాంకర్లతో నీరు తెచ్చి పారించేందు తంటాలు పడుతున్నారు. ఒక్కో ట్యాంకర్‌కు వెయ్యిరూపాయలు వెచ్చించి భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. ఒకటి రెండు తడులతో పంట చేతికొస్తుందనే ఆశతో డబ్బులిచ్చి ట్యాంకర్లతో నీరు పారించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రైతుల ఆశలు అడియాసలే అవుతున్నాయి. నెర్రలుబారిన పొలాల్లో ట్యాంకర్లతో ఎంత నీరు పోసినా కొండ్ర భూమైనా పారడం లేదు. దీంతో వచ్చే దిగుబడి కంటే కూడా రైతులు ఎక్కువ వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మామిడి తోటలు పారించే బోర్లు సైతం ఎండడంతో చెట్లకు ట్యాంకర్లతో నీరు తెచ్చి పోస్తున్నారు. తిప్పాయిగూడలో కరువు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ వ్యవసాయ బోర్లన్నీ వట్టిపోయి వందల ఎకరాల్లో వరి, ఇతర కూరగాయ తోటలు ఎండుతున్నాయి. ట్రాక్టర్‌ ట్యాంకర్లతో నీరు పోసి పంటలను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు.

రెండెకరాల్లో వరి వేస్తే నీరందక ఎండిపోయింది : జెనిగె సత్తయ్య, రైతు, తిప్పాయిగూడ

గత రెండుమూడేండ్లు పంట బాగానే పండింది. ఈ సారి వానలు పడలేదు. యాసంగిలో రెండకరాల్లో వరిపంట వేస్తే చూస్తుండంగానే ఎండిపోతుంది. కొన్ని రోజులు ముందు నాటిన వరి ఇప్పుడు ఈనుతుంది. ఎండుతున్న చేనును చూస్తుంటే దుఃఖం నాకు వస్తుంది. కొంతైనా చేతికొస్తుందేమోనని ట్యాంకర్లతో నీరు తెచ్చి పోస్తున్న. ఇసోంటి కష్టం ఎవ్వరికీ రావొద్దు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

Updated Date - Mar 25 , 2024 | 11:28 PM

Advertising
Advertising