ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేస్తా

ABN, Publish Date - Jun 04 , 2024 | 11:21 PM

స్థానిక సంస్థల బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్‌రెడ్డి తెలిపారు. ఫరూఖ్‌నగర్‌ మండలంలోని ఎలికట్ట భవానీమాత ఆలయంలో మంగళవారం తన అనుచరులతో కలిసి నవీన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.

భవానీమాత దేవాలయంలో పూజలు చేసిన ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి

ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్‌రెడ్డి

షాద్‌నగర్‌ అర్బన్‌, జూన్‌ 4: స్థానిక సంస్థల బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్‌రెడ్డి తెలిపారు. ఫరూఖ్‌నగర్‌ మండలంలోని ఎలికట్ట భవానీమాత ఆలయంలో మంగళవారం తన అనుచరులతో కలిసి నవీన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తనను పిలిచి టికెట్టు ఇవ్వడం, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బీఆర్‌ఎస్‌ నేతలు సహకారం అందించడం, స్థానిక సంస్థల ప్రతినిధులు ఓట్లు వేసి ఎమ్మెల్సీగా గెలిపించడం అదృష్టంగా బావిస్తున్నానని అన్నారు. తనకు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించిన స్థానిక సంస్థల ప్రతినిధుల రుణం తీర్చుకుంటానని తెలిపారు. స్థానిక సంస్థల తరపున పోరాడి, నిధులు తేవడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు బెంది శ్రీనివాస్‌రెడ్డి, కడెంపల్లి శ్రీనివాస్‌, శివచారి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డికి సన్మానం

తలకొండపల్లి : మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించిన నవీన్‌రెడ్డిని మంగళవారం బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, తలకొండపల్లి మాజీ ఎంపీపీ సీఎల్‌ శ్రీనివాస్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. నందిగామ మండలం మొదళ్లగూడలోని ఎమ్మెల్సీ నివాసంలో కలిసి పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభినందించారు. తన విజయానికి సహకరించిన బీఆర్‌ఎస్‌ నాయకులకు, విజయాన్ని అందించిన జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లకు నవీన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీని సత్కరించిన వారిలో జిల్లా కో-ఆప్షన్‌ సభ్యుడు ముజుబుర్‌ రెహమాన్‌, నాయకులు దస్తగిరి, శ్రీరామ్‌, రమేశ్‌, మహేశ్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 04 , 2024 | 11:21 PM

Advertising
Advertising