ప్రతీఒక్కరు ఎన్నికల నియమావళి పాటించాలి
ABN, Publish Date - Apr 19 , 2024 | 12:39 AM
ప్రతీ ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాల్సిందేనని వికారాబాద్ ఆర్డీవో, పరిగి ఏఆర్వో ఎం.వాసుచంద్ర అన్నారు.
పరిగి, ఏప్రిల్ 18: ప్రతీ ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాల్సిందేనని వికారాబాద్ ఆర్డీవో, పరిగి ఏఆర్వో ఎం.వాసుచంద్ర అన్నారు. పరిగి తహసీల్దార్ కార్యాలయంలో గురువారం అన్ని మండలాల తహసీల్దార్లు, మీడియా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కమిషన్ అమలు చేస్తున్న సువిధ, సి-విజిల్, సురక్ష, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ యాక్టుల గురించి వివరించారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వివరాలు నోటీస్ బోర్డులో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఎన్నికలకోడ్ అమలుపై మూడు ఎఫ్‌ఎ్‌సటీ బృందాలు నిరంతరంగా పర్యటిస్తున్నాయని తెలిపారు. ఈవీఎంలు, వీవీ ప్యాడ్‌లు కూడా పరిగికి వచ్చాచని చెప్పారు. పరిగిలో హెల్ప్‌డె్‌స్కను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల పరిగి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,66,291 ఓటర్లు ఉన్నారని, వీరిలో 1,33,451 పురుషులు, 1,32,831 మహిళలు, తొమ్మిది మంది ఇతరులు ఉన్నారని తెలిపారు. సమావేశాలు, ర్యాలీలకు సంబంధించి అనుమతికోసం సువిధ యాప్‌లో ఆప్‌లోడ్ చేయాలని సూచించారు. ఫ్లెక్సీలుగానీ, జెండాలు కానీ వ్యక్తిగత ఇళ్లపై పెట్టిన ఇంటియజమాని అనుమతిపత్రాన్ని రాయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల నిబంధనలకు లోబడి నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. నిబంధనలకు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పరిగి తహసీల్దార్ ఆనంద్‌రావు, సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ సంతోష్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
పెద్దేముల్‌లో 8 పోలింగ్ కేంద్రాలు
పెద్దేముల్{ మండలంలో కొత్తగా 8పోలింగ్ కేంద్రాలు మంజూరైనట్లు తాండూరు రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివా్‌సరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో పోలింగ్ కేంద్రాల పెంపుతో సొంతూరులోనే ఇకనుంచి ఓటువేసే సౌకర్యం కలిగింది. పెద్దేముల్ మండలంలో ప్రజలకు పాలనా సౌలభ్యం కోసం గతప్రభుత్వం కొత్తగా గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పంచాయతీలుగా మారినా అక్కడ పోలింగ్ కేంద్రాలు మాత్రం ఏర్పాటు చేయ ఎన్నికల కమీషన్ నియమనిబందనల ప్రకారం పెద్దేముల్ మండలంలో అర్హత కలిగిన ఊరెంటితండా, సిద్దన్నమడుగుతండా, ఎర్రగడ్డతండా, జయరాంతండా(ఐ), ఖానాపూర్, కందనెల్లితండా, మారెపల్లితండా, బండపల్లి గ్రామాలను గుర్తించి వాటి పేర్లు గతనెలలో సీఈవో కార్యాలయానికి పంపించారు. అధికారులు పంపించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
Updated Date - Apr 19 , 2024 | 12:39 AM