క్వారీల పరిశీలన
ABN, Publish Date - Nov 20 , 2024 | 11:12 PM
కందుకూరు మండలం మీర్కాన్‌పేట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 112లో పలు క్రషర్లకు కేటాయించిన క్వారీలను బుధవారం మైనింగ్ ప్రిన్సిపాల్ కార్యదర్శి సురేంద్రమోహన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి పరిశీలించారు.
కందుకూరు, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): కందుకూరు మండలం మీర్కాన్‌పేట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 112లో పలు క్రషర్లకు కేటాయించిన క్వారీలను బుధవారం మైనింగ్ ప్రిన్సిపాల్ కార్యదర్శి సురేంద్రమోహన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి పరిశీలించారు. గత ప్రభుత్వం 112 సర్వే నంబర్‌లో 55 ఎకరాల భూమిని పలు క్వారీ కంపెనీలకు లీజుకు ఇచ్చింది. అయితే వీటిల్లో నిబంధనల మేరకు తవ్వకాలు జరుగుతున్నాయా లేదా అనే దానిపై సర్వే చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ భూములను టీజీఐఐసీకి కేటాయించారని, అవసరమైతే క్వారీలకు ఇచ్చిన లీజు ప్రతిపాదనను వెనుక్కు తీసుకుంటామని వారు తెలిపారు. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే ఫ్యూచర్ సిటీకి క్వారీ నుంచి వెలువడే కంకర, డస్టు ఎంతవరకు ప్రభావం చూపుతుందని అధికారులు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దార్ కె.గోపాల్ పాల్గొన్నారు.
Updated Date - Nov 20 , 2024 | 11:12 PM