ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నకిలీ సిగరెట్ల స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు

ABN, Publish Date - Apr 10 , 2024 | 11:57 PM

శంషాబాద్‌ ఆర్జీఐఏ పరిధి గగన్‌పహాడ్‌లో మంగళవారం నకిలీ సిగరెట్ల స్మగ్లింగ్‌ ముఠా గుట్టును ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు.

ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్న నకిలీ సిగరెట్లు

రూ.2కోట్ల విలువ చేసే నకిలీ సిగరెట్లు స్వాధీనం

నలుగురు నిందితుల అరెస్టు

శంషాబాద్‌, ఏప్రిల్‌ 10 : శంషాబాద్‌ ఆర్జీఐఏ పరిధి గగన్‌పహాడ్‌లో మంగళవారం నకిలీ సిగరెట్ల స్మగ్లింగ్‌ ముఠా గుట్టును ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. రూ.2కోట్ల విలువైన నకిలీ బ్రాండ్ల సిగరెట్లను సీజ్‌ చేశారు. సైబరాబాద్‌ కషనరేట్‌లో సంచలనం రేపిన ఈ సంఘటనలో నకిలీ సిగరెట్లు సరఫరా చేస్తున్న బిహార్‌ రాష్ట్రానికి చెందిన నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్‌కు చెందిన రవికాంత్‌కుమర్‌(27), మహ్మద్‌ షాహిద్‌(36), ముబారిక్‌ ఖాన్‌(18), సయ్యద్‌ ఇలయసుద్దీన్‌(36), రెహాన్‌ఖాన్‌(32), రాజు అలియాస్‌ సుభా్‌షలు ముఠాగా ఏర్పడి డిటర్జెంట్‌ పౌడర్‌ సరఫరా ముసుగులో నకిలీ సిగరెట్లను వివిధ రాష్ట్రాలకు స్మగ్లింగ్‌ చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన ఎస్వోటీ పోలీసులు గగన్‌పహాడ్‌లోని పార్కింగ్‌ ఏరియాలో తనిఖీలు చేయగా వీరి గుట్టురట్టయ్యింది. ముఠాలోని నలుగురిని అరెస్టు చేయగా రాజు పరారీలో ఉన్నాడు. పూర్తిస్థాయి దర్యాప్తునకు కేసును ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ ముఠా ఏయే ప్రాంతాలకు నకిలీ సిగరెట్లను సరఫరా చేసిందో తెలుసుకునేందుకు రెండు టీంలు రంగంలోకి దిగాయి.

Updated Date - Apr 10 , 2024 | 11:57 PM

Advertising
Advertising