దేశానికి వెన్నెముక రైతులు
ABN, Publish Date - Nov 14 , 2024 | 11:48 PM
ప్రతీ మనిషికి పట్టెడన్నం పెట్టిననాడే దేశం అభివృద్ధి చెందుతుందని, రైతులు దేశానికి వెన్నుముక లాంటివారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గురువారం శామీర్‌పేట రైతు సహకార సంఘం ప్రాంగణంలో చైర్మన్ మధుకర్‌రెడ్డితో కలసి ఈనెల 14 నుంచి 20వరకు నిర్వహించే 71వ అఖిల భారత సహకార వారోత్సవాలను ఎంపీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అఖిల భారత సహకార వారోత్సవాల్లో ఎంపీ ఈటల రాజేందర్
శామీర్‌పేట, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రతీ మనిషికి పట్టెడన్నం పెట్టిననాడే దేశం అభివృద్ధి చెందుతుందని, రైతులు దేశానికి వెన్నుముక లాంటివారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గురువారం శామీర్‌పేట రైతు సహకార సంఘం ప్రాంగణంలో చైర్మన్ మధుకర్‌రెడ్డితో కలసి ఈనెల 14 నుంచి 20వరకు నిర్వహించే 71వ అఖిల భారత సహకార వారోత్సవాలను ఎంపీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ నిరుపేద దేశంగా ఉన్న భారత్ ఆర్థికంగా ఎదగాలంటే అన్నివర్గాలు కలసికట్టుగా పనిచేస్తూ రైతులకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ల వెంట పరిగెత్తితే అభివృద్ధికి బాటలు పడవని, దేశం ఆర్థికంగా ఎదగాలంటే కేవలం టెక్నాలజీ, కార్పొరేట్ అంటే సరిపోదని.. లాభనష్టాలను చూడకుండా వ్యవసాయ రంగంలో రైతాంగానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందన్నారు. సహకార సంఘాలు రైతులను ప్రోత్సహించాలని, నూతన వంగడాలు, మార్కెటింగ్ వంటి అంశాలు, కొత్త పెట్టుబడులతో ఆర్థిక పరిపుష్ఠి సాధించాలని హితవు పలికారు. రైతుల సంక్షేమానికి కావల్సిన సదుపాయాలను కేంద్రం ద్వారా కల్పించేందుకు కృషి చేస్తానని ఈటల భరోసా కల్పించారు. శామీర్‌పేట రైతు సహకార సంఘం చైర్మన్, డీసీఎంఎస్ వైస్‌చైర్మన్ రామిడి మధుకర్‌రెడ్డి మాట్లాడుతూ అప్పుల ఊబిలో ఉన్న శామీర్‌పేట సహకార సంఘాన్ని డైరెక్టర్లు, రైతుల సహకారంతో లాభాల బాటలోకి తీసుకవచ్చినట్లు వివరించారు. రాష్ట్ర రైతు సహకార సంఘం అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలుయాదవ్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌యాదవ్, మాజీ ఎంపీటీసీ సుదర్శన్, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్య, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
Updated Date - Nov 14 , 2024 | 11:48 PM