పండగలను సామరస్యంగా జరుపుకోవాలి
ABN, Publish Date - Sep 07 , 2024 | 12:34 AM
పండుగలను భక్తి శ్రద్ధలతో సామర్యంగా జరుపుకోవాలని ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం అంబేద్కర్ భవనంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ పండుగల సందర్భంగా శాంతి సమావేశం నిర్వహించారు.
వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి
వికారాబాద్, సెప్టెంబర్ 6 : పండుగలను భక్తి శ్రద్ధలతో సామర్యంగా జరుపుకోవాలని ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం అంబేద్కర్ భవనంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ పండుగల సందర్భంగా శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గణేశ్ మండలపాల వద్ద పోలీసు బందోబస్తు ఉంటుందని, అందులో భాగంగా మండపాల నిర్వాహకులు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వాటికి జియో ట్యాగింగ్ ఉంటుందని, డీజే అనుమతులు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడం జరగదని సూచించారు. మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేశ్ మాట్లాడుతూ.శోభయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వాసుచంద్ర, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, ఎక్సైజ్ సీఐ రాఘవీణా, నాయకులు మాధవరెడ్డి, తస్వర్ అలీ, చిగుళ్లపల్లి రమేశ్, జాఫర్, శ్రీనివాస్ గౌడ్, శివరాజ్, కేపీ రాజు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 07 , 2024 | 12:34 AM