కలప లారీకి జరిమానా
ABN, Publish Date - Nov 19 , 2024 | 11:56 PM
అక్రమంగా కలప తరలిస్తూ పట్టుబడిన లారీకి అటవీశాఖ అధికారకులు రూ.20వేల జరిమానా విధించారు.
బషీరాబాద్, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): అక్రమంగా కలప తరలిస్తూ పట్టుబడిన లారీకి అటవీశాఖ అధికారకులు రూ.20వేల జరిమానా విధించారు. ఈ మేరకు బీట్ అధికారి మల్లయ్య మంగళవారం ధ్రువీకరించారు. ఈనెల 17న మండలంలోని జీవన్గి శివారులోంచి అనుమతులు లేకుండా కలపను నరికి లారీలో తరలిస్తున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం రాగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని ఫారెస్టు అధికారులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో లారీకి ఆశాఖ అధికారులు జరిమానా విధించి వదిలి పెట్టారు. ఎవరైనా అనుమతులు లేకుండా చెట్లనునరికి తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆశాఖ అధికారులు వెల్లడించారు.
Updated Date - Nov 19 , 2024 | 11:56 PM