నిల్వ చేసిన పత్తికి నిప్పు
ABN, Publish Date - Nov 19 , 2024 | 12:05 AM
గుర్తు తెలియని వ్యక్తులు నిల్వ చేసిన పత్తికి నిప్పంటించారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దాపూర్ గ్రామానికి చెందిన దేవ్‌కుమార్ అనే రైతు మర్పల్లి మండల కేంద్రంలోని సర్వే నెం.201, 202లో 15ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు.
మర్పల్లి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): గుర్తు తెలియని వ్యక్తులు నిల్వ చేసిన పత్తికి నిప్పంటించారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దాపూర్ గ్రామానికి చెందిన దేవ్‌కుమార్ అనే రైతు మర్పల్లి మండల కేంద్రంలోని సర్వే నెం.201, 202లో 15ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. అట్టి భూమిలో మూడెకరాల 20గుంటల వరకు దాదాపు రూ.లక్ష పెట్టుబడితో పత్తి పంటను సాగుచేశాడు. మూడు రోజులుగా కూలీలతో పత్తినితీసి పొలం దగ్గర ఉన్న గదిలో 30క్వింటాళ్ల వరకు నిల్వచేశాడు. ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పత్తికి నిప్పంటించారు. గదిలో నుంచి మంటలు రావడంతో గమనించిన స్థానికులు రైతుకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లి చూడగా నిల్వ చేసిన పత్తి పూర్తిగా దగ్ధమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. చేతికి వచ్చిన పంట దగ్ధం కావడంతో రూ.3లక్షలు ఆస్తినష్టం జరిగిందని రైతు వాపోయాడు.
Updated Date - Nov 19 , 2024 | 12:05 AM